ఆయుధ పూజ.. దసరా రోజు చేసే పూజ ఇది. వారి వారి స్థోమతను బట్టి ఈ ఆయుధ పూజ చేయటం ఆనవాయితీ. ఈ క్రమంలోనే పోలీసులు అయితే తమ దగ్గర ఉంటే తుపాకులకు పూజలు చేస్తుంటారు. ఇది కామన్. ఈసారి ఇలాంటి పూజ సందర్భంగా ఓ వీడియో వైరల్ అయ్యింది. ఏంటనేది ఇప్పుడు తెలుసుకుందామా..
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రం రాజ్ నంగ్ గావ్ జిల్లా. ఆ జిల్లాకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్.. SP గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అంకిత శర్మ. ఆయుధ పూజలో భాగంగా సంప్రదాయమైన దుస్తులు అంటే పోలీస్ యూనిఫాం కాకుండా చీరకట్టులో వచ్చారు ఎస్పీ అంకిత శర్మ. పూజ తర్వాత అక్కడే ఉన్న ఓ AK 47 గన్ తీసుకున్నారు. బుల్లెట్స్ లోడ్ చేశారు. గురి పెట్టారు.. గాల్లోకి ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపారు. జిల్లా ఎస్పీ స్థాయి అధికారి కాల్పులు జరపటంలో వింత, విశేషం లేదు కానీ.. ఎస్పీ అంకిత శర్మ చీరకట్టులో.. అందులోనూ ఏకే 47 తుపాకీతో కాల్పులు జరిపే వీడియో ఏదైతే ఉందో.. ఆ వీడియో వైరల్ అయ్యింది.
ఎవరీ అంకిత శర్మ :
ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో అత్యంత సమస్యాత్మకమైన ప్రాంతం అయిన రాజ్ నందగావ్ జిల్లాకు ఆమె ఎస్పీగా పని చేస్తున్నారు. శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తారు. ఈ క్రమంలోనే ఆమెను లేడీ సింగం అంటూ స్థానికులు పిలుస్తుంటారు. 2018 బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ఆమె. ఎస్పీ అంకిత శర్మకు వైరల్ కావటం ఇదేమీ కొత్తకాదు. ఆమె చేసే పనుల వల్ల తరచూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఈసారి నిండైన చీరకట్టులో ఏకే 47 తుపాకీతో కాల్పులు జరపటం.. అది ఆయుధ పూజ సమయంలో కావటంతో మరోసారి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నారు. మరో విశేషం కూడా ఉంది. ఆమె సొంత రాష్ట్రం ఛత్తీస్ ఘడ్..
