6,000 ఎంఏహెచ్ .. బ్యాటరీతో ఐకూ జెడ్ 9ఎక్స్

6,000 ఎంఏహెచ్ .. బ్యాటరీతో ఐకూ జెడ్ 9ఎక్స్

న్యూఢిల్లీ : వివో సబ్​‌‌– బ్రాండ్ ఐకూ తన లేటెస్ట్​ ఫోన్​ జెడ్ 9ఎక్స్ ను ఈ నెల 16న లాంచ్​ చేయనున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇందులో 6,000 ఎంఏహెచ్​బ్యాటరీతోపాటు స్నాప్ డ్రాగన్  6 జెన్ 1 ప్రాసెసర్​, 7.99 ఎంఎం అల్ట్రా స్లిమ్ బాడీ, 44 వాట్ ఫ్లాష్ చార్జ్, 5జీ వంటి ఆకర్షణలు ఉన్నాయి.  

ఐకూ జెడ్ 9ఎక్స్ టోర్నడో గ్రీన్  స్టార్మ్,  గ్రే వేరియంట్లలో వస్తుంది. 'మేక్ ఇన్ ఇండియా'కు ఐకూ నిబద్ధతను కొనసాగిస్తూ ఐకూ జెడ్ 9ఎక్స్ ను వివో గ్రేటర్ నోయిడా ప్లాంట్‌‌‌‌‌‌‌‌లో తయారు చేస్తున్నామని ఐకూ తెలిపింది.