దాడులకు భయపడం.. పాలసీ మార్చుకోం : మంత్రి అబ్బాస్ అరాఘ్చి

దాడులకు భయపడం.. పాలసీ మార్చుకోం : మంత్రి అబ్బాస్ అరాఘ్చి
  • ట్రంప్ బెదిరింపులకు అరాఘ్చి కౌంటర్

టెహ్రాన్: అమెరికా, ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో పశ్చిమాసియాలో సరికొత్త పరిస్థితులు నెలకొన్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్' జలసంధి ఇకపై యుద్ధానికి ముందునాటి స్థితికి ఎప్పటికీ రాదని ఆయన స్పష్టంచేశారు. యుద్ధం వచ్చినా, దాడులు జరిగినా తమ దేశ విధానాల్లో ఎలాంటి మార్పు ఉండదని తేల్చిచెప్పారు. అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి ఇరాన్‌‌పై సైనిక చర్యకు దిగితే గతంలో వచ్చిన ఫలితాలే వస్తాయి తప్ప భిన్నంగా ఏదీ జరగదని అరాఘ్చి పేర్కొన్నారు.

ఏకాస్త బుద్ధి ఉన్నా మళ్లీ దాడులు చేయాలనే సాహసం అమెరికా చేయదన్నారు. కాగా, తప్పుడు విధానాల వల్లే అమెరికా సంక్షోభంలో చిక్కుకుందని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బాఘెర్ గాలిబాఫ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మీడియా ఒత్తిళ్లు, సైనిక బెదిరింపులతో టెహ్రాన్‌‌ను లొంగదీసుకోవడం ఎవరివల్లా కాదని స్పష్టంచేశారు. అమెరికా తన తప్పులను గ్రహించి, ఈ కాలువ నుంచి బయటపడేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన హితవు పలికారు. ఇరాన్ ఆత్మవిశ్వాసానికి, రక్షణ బలగాలకు ఒక కోట లాంటిదని, ఏ విదేశీ శక్తి కూడా తమకు ఆదేశాలు జారీ చేసేందుకు అనుమతించే ప్రసక్తే లేదని గాలిబాఫ్ తేల్చిచెప్పారు.