కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి!..మంచు ప్లాన్ అదుర్స్

కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి!..మంచు ప్లాన్ అదుర్స్

మంచు విష్ణు (Manchu Vishnu) టైటిల్ రోల్లో కనిపించనున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు కన్నప్ప(Kannappa). భారీ బడ్జెట్ తో, పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ (Mukhesh kumar singh) దర్శకత్వం వహిస్తున్నారు.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం..ఈ భక్తి రస ప్రాజెక్ట్ నుంచి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. కన్నప్పలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో చాలా ముఖ్యమైన అతిథి పాత్రలో నటించాలని మోహన్ బాబు కోరగా..మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.త్వరలోనే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇదే కనుక నిజమైతే..కన్నప్ప మూవీ మంచు ఫ్యామిలీకి తిరుగులేని విజయం అందుకోవడం కన్ఫమ్ అంటూ సినీ విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో ముగా ఫ్యాన్స్ తో పాటు..మంచు ఫ్యాన్స్ కూడా ఖుషి అవుతున్నారు. 

ఇప్పటికే ఈ మూవీలో కీలకమైన పాత్రల కోసం మంచు మోహన్ బాబు(Mohan Babu), శరత్ కుమార్ (Sarath Kumar), కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ భాగమయ్యారు. 

ఇప్పటికే  ఈ ప్రాజెక్టు చాలా భారీగా తయారైంది.  ఈ భక్త కన్నప్ప సినిమాలో శివుడి పాత్ర చాలా కీలకం. అందుకే ఈ సినిమాలో శివుడి పాత్ర కోసం..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను తీసుకున్నారని సమాచారం. ఇదే విషయాన్ని మంచు విష్ణు ఇండైరెక్ట్గా రివీల్ చేశారు. ఇక ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం మేరకు శివుడి పక్కన పార్వతిగా లేడీ సూపర్ స్టార్ నయనతారను తీసుకున్నారట మేకర్స్. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమాకు మోస్ట్ సీనియర్ రైటర్స్..పరుచూరి గోపాలకృష్ణ తో పాటు బుర్ర సాయిమాధవ్, తోట ప్రసాద్ ప్రాజెక్ట్ లో చేరి..కథకు మెరుగులు దిద్దారు. దీంతో కన్నప్ప కథ స్థాయి..అమాంతం పెరుగుతూ వస్తోంది.