ఆగిపోయిన మెగాస్టార్ కొత్త మూవీ.. కారణం అదేనా?

ఆగిపోయిన మెగాస్టార్ కొత్త మూవీ.. కారణం అదేనా?

మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) తన పుట్టినరోజు సంబంర్బంగా రెండు కొత్త సినిమాల ప్రకటించారు. అందులో ఒకటి తన పెద్ద కూతురు సుస్మిత కొణిదెల (Susmitha konidela) నిర్మాణ సంస్థతో చేస్తున్న సినిమాకాగా.. రెండవది యు.వి.క్రియేషన్స్‌ (UV Creations) సంస్థతో చేస్తున్న సినిమా. ఈ రెండు సంస్థలు అధికారికంగా మెగాస్టార్ చిరంజీవితో తమ సినిమాలను ప్రకటించాయాయి. 

అయితే తాజాగా సుస్మిత నిర్మాణంలో వస్తున్న మెగా 156 ప్రాజెక్టుపై ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిందట. కారణం స్క్రిప్ట్ సరిగ్గా కుదరకపోవడమే అని తెలుస్తోంది. ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తారు అనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు మళయాళ సినిమా బ్రో డాడీ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా రానుంది అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యిందని తెలుస్తోంది. 

అయితే ఈ వార్తల్లో నిజమెంత అనేది తెలియాలంటే ప్రొడక్షన్ హౌస్ నుండి అధికారిక ప్రకటన రావాల్సిందే. ఇక యూవీ క్రియేషన్స్ లో వస్తున్న సినిమా.. ప్రీ ప్రొడక్షన్ పనులు ఈ మధ్య మొదలయ్యాయి. వశిష్ట దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా.. సోషియో ఫాంటసీ కథతో రూపొందనుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.