వెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉందా..? ఈ చిన్న గాడ్జెట్‌తో క్షణాల్లో పని ఖతం!

వెల్లుల్లి పొట్టు తీయడం కష్టంగా ఉందా..? ఈ చిన్న గాడ్జెట్‌తో క్షణాల్లో పని ఖతం!

వెల్లుల్లిపాయలను అప్పటికప్పుడు పొట్టు తీసి నూరి వేసుకుంటే వంటకం రుచి మరింత పెరుగుతుంది. కానీ.. వెల్లుల్లి పొట్టు తీయడానికి చాలా టైం పడుతుంది. పైగా తీసిన తర్వాత చాలాసేపు చేతులకు వెల్లుల్లి వాసన వస్తుంటుంది. కానీ.. ఇలాంటి సమస్యలేమీ లేకుండా ఈ గాడ్జెట్‌‌తో వెల్లుల్లిపాయల పొట్టును సులభంగా తీసేయొచ్చు. 

దీన్ని హెవీ డ్రైవర్ అనే కంపెనీ మార్కెట్‌‌లోకి తీసుకొచ్చింది. ఇది ఒక స్మార్ట్ కిచెన్ టూల్. ఈ అటాచ్‌‌మెంట్‌‌ను హ్యాండ్‌‌ లేదా మీట్ గ్రైండర్‌‌కు అమర్చి వాడుకోవచ్చు. ఇది గిన్నెలో వేసిన వెల్లుల్లి రెబ్బల పొట్టుని క్షణాల్లో తీసేస్తుంది. దీన్ని బలమైన పీపీ బాడీ, ఫ్లెక్సిబుల్ సిలికాన్ మెటీరియల్‌‌తో తయారు చేయడం వల్ల చాలాకాలం మన్నికగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడం, మెయింటెయిన్ చేయడం కూడా చాలా సులభం.   దీని ధర  రూ.498.