ప్రభాస్ కూడా సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నారా..

ప్రభాస్ కూడా సినిమాలకు బ్రేక్ తీసుకుంటున్నారా..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా వస్తున్న అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమా..సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్ అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతున్నారు. 

ప్రభాస్ కంటిన్యూ గా షూటింగ్స్ లో జాయిన్ అవ్వడం వల్ల తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడుతున్నట్లు సమాచారం. ఇక తన నుంచి రాబోయే మూవీస్ కోసం కొంత గ్యాప్ తీసుకోనున్నట్లు తెలుస్తుంది.  ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 AD,సలార్ మూవీస్ కంప్లీట్ దశలో ఉన్నాయి.ఈ మూవీస్ నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ అంచనాలు భారీగా పెంచేశాయి.ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రభాస్ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు..ఇక ఈ మూవీస్ షూట్ కంప్లీట్ అయినా తర్వాత ప్రభాస్..సినిమాలకు బ్రేక్ తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఈ మూవీస్ కోసం నవంబర్ వరకు టైం కేటాయించినట్లు..డిసెంబర్‌లో బ్రేక్ ఇస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే ప్రభాస్ గత చిత్రాలు రాధే శ్యామ్, ఆదిపురుష్ బాక్సాపీస్ వద్ద డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఫ్యాన్స్ కు కల్కి, సలార్ మూవీస్ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు. 

ఇక సలార్‌ మూవీ విషయానికి వస్తే..ఈ మూవీ రెండు పార్ట్స్ గా తెరకెక్కనుంది. సలార్ పార్ట్ 1 కోసం రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో మూవీ రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్‌తో పాటు, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్, జగపతి బాబు, టిను ఆనంద్, గరుడ రామ్, శ్రీయా రెడ్డి కీ రోల్స్ లో యాక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి కేజిఫ్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ అద్దిరిపోయే టోన్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.