సలార్ విషయంలో అనుకున్నదే జరిగిందా?.. పాపం ప్రభాస్ ఫ్యాన్స్

సలార్ విషయంలో అనుకున్నదే జరిగిందా?.. పాపం ప్రభాస్ ఫ్యాన్స్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabahs) హీరోగా వస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ సలార్(Salaar). కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా ప్రభాస్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలున్నాయి. చాలా రోజులుగా రిలీజ్ పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు డిసెంబర్ 22న థియేటర్స్ లోకి వస్తోంది.

ఇందులో భాగంగా తాజాగా సలార్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతోకాలంగా ఎదురుచూసిన ఈ ట్రైలర్ ను మాస్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్ తో నింపేశాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే ఈ ట్రైలర్ ప్రభాస్ ఫ్యాన్స్ కు నచ్చినప్పటికీ.. కొంత మందికి మాత్రం ఎక్కలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో ప్రభాస్ కన్నా పృధ్విరాజ్ ఎక్కువగా కనిపించారని, ప్రభాస్ డైలాగ్స్ సరిగా లేవని, బీజీఎమ్ కూడా అంతలా ఆకట్టుకోలేదని కామెంట్స్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. సలార్ సినిమాపై ముందు నుండి ఒక కామెంట్ వినిపించింది. అదేంటంటే.. సలార్ మూవీ ప్రశాంత్ నీల్ మొదటి సినిమా ఉగ్రం కు రీమేక్ అని. కానీ మేకర్స్ మాత్రం ఇది ఆరోజినల్ స్టోరీ అని, ఉగ్రంతో ఎలాంటి కనెక్షన్ ఉందని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా రిలీజైన సలార్ ట్రైలర్ చూస్తే మాత్రం అది నిజమే అని తెలుస్తోంది. సలార్ ట్రైలర్ లో ఫ్రెండ్ కోసం రంగంలోకి దిగిన హీరోగా ప్రభాస్ ను చూపించారు. ఉగ్రం సినిమాలో కూడా స్నేహితుడి కోసం హీరో శత్రువుతో పోరాడుతారు. దీంతో ఈ రెండు సినిమాల కథలు ఒకటే అని, సలార్ ఉగ్రం సినిమాకు రీమేక్ అనే కామెంట్స్ ఊపందుకున్నాయి. మరి నిజంగా సలార్ సినిమా ఉగ్రం సినిమాకు రీమేక్ గా వస్తుందా? లేదా కొత్త కథేనా? అనేది తెలియాలంటే డిసెంబర్ 22 వరకు ఆగాల్సిందే. కానీ సలార్ సినిమాపై ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఆశలే పట్టుకున్నారు. నిజంగా ఉగ్రం కథతో సలార్ కు లింక్ ఉంటే మాత్రం పాపం ప్రభాస్ ఫ్యాన్స్ అనాల్సిందే.