Ravi Shastri: భారత అండర్-15, దేశవాళీ క్రికెట్‌లో తన విద్వంసకర బ్యాటింగ్‌తో సంచలనాలు సృష్టిస్తున్న యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Sooryavanshi) పేరు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ మార్మోగుతోంది. న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మాజీ హెడ్ కోచ్, ప్రముఖ కామెంటేటర్ రవిశాస్త్రి (Ravi Shastri) తాజాగా ఒక ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు ముందు కివీస్ అభిమానులు తనను కలిసి వైభవ్ సూర్యవంశీ గురించిన ఆసక్తికరమైన ప్రశ్న అడిగినట్లు రవిశాస్త్రి తెలిపారు.
కివీస్ వీధుల్లోనూ వైభవ్ గురించే చర్చ:
రవిశాస్త్రి న్యూజిలాండ్‌లో ఒక నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో కొందరు స్థానిక న్యూజిలాండ్ క్రికెట్ అభిమానులు ఆయన దగ్గరకు వచ్చారట. ఆ కుర్రాడిని ఇప్పటికే చాలా కాలం పాటు బెంచ్‌కే పరిమితం చేశారని, ఇకనైనా అతనికి ప్లేయింగ్ ఎలెవ్‌న్‌లో అవకాశం ఇవ్వాలని వాళ్లు కోరినట్లు శాస్త్రి తెలిపాడు. చాలా చిన్న వయసులోనే వైభవ్ బ్యాటింగ్ శైలి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ప్రేమికులను ఎంతగానో ఆకర్షిస్తోందని దీనివల్ల స్పష్టమవుతోంది.
రవిశాస్త్రి కీలక సూచన:
అభిమానుల నుంచి వైభవ్ సూర్యవంశీపై వస్తున్న భారీ క్రేజ్, అంచనాల గురించి రవిశాస్త్రి మాట్లాడుతూ.. టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. వైభవ్ లాంటి యువ ప్రతిభావంతుల విషయంలో మేనేజ్‌మెంట్ ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని అభిప్రాయపడ్డారు. ఆటగాళ్లపై ఉండే అంచనాల ఒత్తిడిని తట్టుకునేలా సరైన అవకాశాలు ఇచ్చి సపోర్టు చేయడంతో పాటు వారిని దశలవారీగా తీర్చిదిద్దడం చాలా అవసరమని రవిశాస్త్రి పేర్కొన్నారు.
Ravi Shastri said, “I walking down the river yesterday and few Kiwi fans asked me, ‘Is the 15-year-old kid playing tomorrow?’. He’s warmed the bench long enough, you don’t wanna lose his form”. https://t.co/PdsfsOyO80
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 22, 2026
