జ్యోతిష్యం: బయటకు వెళ్లేటప్పుడు తుమ్ము శబ్దం లాభమా..నష్టమా....శకున శాస్త్రంలో ఏముంది..

జ్యోతిష్యం:  బయటకు వెళ్లేటప్పుడు తుమ్ము శబ్దం లాభమా..నష్టమా....శకున శాస్త్రంలో ఏముంది..

జలుబు చేసినా.. కొంతమందికి తలస్నానం చేసినా.. తుమ్ములు వస్తాయి.  సాధారణంగా వాతావరణంలో వచ్చే మార్పుల వలన తుమ్ములు వస్తాయి.  జ్యోతిష్యంలో శకున శాస్త్రంలో పురాణాల ప్రకారం తుమ్ముల ద్వారా కొన్ని శుభ, అశుభ ఫలితాలు, సూచనలు ఉంటాయని నమ్ముతారు. ఇప్పుడు శకున శాస్త్రం గురించి తెలుసుకుందాం..

శకున శాస్త్రం ప్రకారం తుమ్మడానికి దానికంటూ ఒక ప్రత్యేక అర్థం, ప్రాముఖ్యత కూడా ఉన్నాయి.  ఇంట్లోని బయటకు వెళ్లటప్పుడు తుమ్మితే వెళ్లిన పనికి ఆటంకాలు కలిగే అవకాశం ఉందని .. అందువల్ల ఒక్క క్షణం కూర్చొని .. మంచినీరు తాగి వెళుతుంటారు.  పెద్దలు కూడా ఇదే విషయాన్ని చెబుతుంటారు.  కాని అన్ని వేళల్లో ఇది కీడు శంకించదని కొన్ని తుమ్ములు శుభానికి సంకేతమని శకున శాస్త్రం ద్వారా తెలుస్తుంది. 

ఉద్యోగానికి కాని.. ముఖ్యమైన పనికి వెళ్లేటప్పుడు మన ఎడమ వైపునగాని.. వెనుక నుంచి గాని తుమ్ము శబ్దం వస్తే చాలా మంచి జరుగుతుందని .. శుభ శకునమని నిపుణులు చెబుతున్నారు. అలా జరిగితే మొదలుపెట్టిన పనిలో తప్పకుండా విజయం లభిస్తుందని నమ్ముతారు.

 ఇంటి నుండి బయలుదేరేటప్పుడు ఒకసారి తుమ్మడం పనికి ఆటంకంగా భావిస్తుండగా, వరుసగా రెండు  అంతకంటే ఎక్కువసార్లు తుమ్మడం పనిలో లాభానికి, విజయానికి సంకేతంగా చెబుతారు.

 కొంతమంది పొద్దున్నే తుమ్ములతోనే నిద్ర లేస్తారు.  అలా లేచేటప్పుడు తుమ్ముల శద్దం వింటే శుభ శకునమని.. అదే రాత్రి పూట తుమ్మితే .. మరుసటి రోజు శుభవార్త వినే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.  శకునాల ప్రకారం ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటనలను సూచిస్తుందని నమ్ముతుంటారు.

Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని  పురాణాల ప్రకారం పండితులు.. నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న ఆధ్యాత్మిక నిపుణులను సంప్రదించటం ఉత్తమం.