Vastu Tips : ఇంట్లో పెంచుకునే చెట్లకు వాస్తుకు సంబంధం ఉందా..? దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉండకూడదా..

Vastu Tips : ఇంట్లో పెంచుకునే చెట్లకు వాస్తుకు సంబంధం ఉందా..? దక్షిణం వైపు ఖాళీ స్థలం ఉండకూడదా..

ప్రతి ఇంట్లో పూల మొక్కలు.. పండ్ల మొక్కలు.. ఆకు కూరలను పెంచుకుంటాం.  కొంతమంది ముళ్ల చెట్టు ఇంట్లో ఉండకూడదని చెబుతుంటారు.  అసలు గులాబీ.. బొప్పాయి లాంటి మొక్కలు ఇంట్లో ఉండవచ్చా.. ఇంటికి దక్షిణంవైపు ఖాళీ స్థలం ఉండకూడదా.. ఇలాంటి ప్రశ్నలకు  వాస్తు కన్సల్టెంట్ కాశీనాథుని శ్రీనివాస్ సూచిస్తున్న సలహాలను ఒకసారి పరిశీలిద్దాం.. .

ప్రశ్న: మా ఇంటికి ఉత్తరంలో ఉన్న ఖాళీస్థలంలోగులాబీ చెట్లు, బొప్పాయి చెట్లు పెంచుకుంటున్నాం. కొందరు ముళ్లచెట్లు, పాలుకారే చెట్లు ఇంటిదగ్గర ఉండకూడదని అంటున్నారు. పెంచుకునే చెట్లకు, ఇంటి వాస్తుకు సంబంధం ఉంటుందా? 

జవాబు : ముళ్లచెట్లు, పాలుగారే చెట్ల వల్ల పిల్లలు ఇబ్బంది పడతారని వద్దంటారు. గులాబీ చెట్లకు ముళ్లుంటాయి కాబట్టి పిల్లలకు గుచ్చుకుంటాయి. బొప్పాయి చెట్లకు పాలుగారడమే కాదు, పిల్లలు ఆడుకుంటూ వాటిని ఎక్కితే విరుగుతాయి. అందుకే పెద్దవాళ్లు వద్దంటారు. వాస్తు ప్రకారం ఇంటికి, పెంచుకునే చెట్లకు ఎలాంటి సంబంధం లేదు. 

ప్రశ్న:మా ఇంటికి తూర్పు వాకిలి. తూర్పు, ఉత్తరం దిక్కుల్లో రోడ్లు ఉన్నాయి. దక్షిణం దిక్కులో ఉన్న ఖాళీస్థలంలో చుట్టిల్లు కట్టుకున్నాం. అక్కడ వంట చేసుకునే వాళ్లం. ఆ ఇల్లు పడిపోయింది. ఆ స్థలాన్ని ఎలా వాడుకుంటే మంచిది? 

జవాబు : ఇంటి స్థలానికి తూర్పు, ఉత్తరం ఖాళీ ఉంటే మంచిది. దక్షిణం వైపు ఎక్కువగా ఉండ కూడదు. దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలాన్ని విడగొట్టి, ఇంటి స్థలానికి దానికి మధ్య గోడ లేదా కంచె కట్టండి. ఎట్లాగూ వంటిల్లు పడిపోయింది. కాబట్టి, దక్షిణ ఆగ్నేయంలో కొత్తగా వంటిల్లు కట్టుకోవచ్చు. వద్దనుకుంటే ఆ స్థలంలో మొక్కలు పెంచుకోవచ్చు.