Vishwambhara: విశ్వంభరలో ఫేడౌట్ బ్యూటీస్.. భారీ సినిమాలో బంపర్ ఆఫర్

Vishwambhara: విశ్వంభరలో ఫేడౌట్ బ్యూటీస్.. భారీ సినిమాలో బంపర్ ఆఫర్

మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ విశ్వంభర(Vishwambhara). బింబిసార ఫేమ్ వశిష్ట(Vassishta) దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెడ్ తో నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదలైన టైటిల్ వీడియో ఆ అంచనాలను మరింత పెంచేశాయి. దీంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్ తోపాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. 

ఇక ఈ సినిమా మొదలైనప్పటి నుండి హీరోయిన్స్ విషయంలో చాలా రోమర్స్ వినిపించాయి. మృణాల్, అనుష్క, హనీ రోజ్ ఇలా చాలా పేర్లు వినిపించాయి. కనే ఫైనల్ గా చెన్నై బ్యూటీ త్రిషను సెలెక్ట్ చేశారు మేకర్స్. ఇదే విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో త్రిషతో పాటు మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఛాన్స్ దక్కించుకున్నారట. ఆ ఇద్దరు మీరెవరు కాదు సురభి, ఇషా చావ్లా. ఈ ఇద్దరు హీరోయిన్స్ దాదాపు ఫెడౌట్ అయిపోయారు. కనీసం చిన్న సినిమాల్లో కూడా అవకాశాలు లేవు ఈ హీరోయిన్స్ కి. అలాంటిది విశ్వంభర లాంటి భారీ సినిమాలో అవకాశం రావడంతో ఫుల్లు ఖుషీగా ఉన్నారట. ఇప్పటికే వీరికి సంబందించిన షూట్ కూడా జరిగిందని తెలుస్తోంది.

అయితే సినిమాలో వీరి పాత్ర ఏమేరకు ఉంటుంది అనేది చూడాలి. ఇక విశ్వంభర సినిమా విషయానికి వస్తే.. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాను చోట కే నాయుడు కెమెరామెన్ గా చేస్తున్నారు. భారీ గ్రాఫిక్స్ తో విజువల్ వండర్ గా వస్తున్న ఈ సినిమాలో సోహియో ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని టాక్. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.