న్యూఢిల్లీ: తెలంగాణ స్టార్ షూటర్ ఇషా సింగ్ ఆసియా చాంపియన్‌షిప్ (పిస్టల్ / రైఫిల్)లో అద్భుతమైన గురితో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన రెండు విభాగాల్లో గోల్డ్ మెడల్‌తో మెరిసింది. విమెన్స్ ఇండివిడ్యువల్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఇషా 239.8 పాయింట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. తైపీ షూటర్లు చెంగ్ యెన్ చాంగ్ (235.4), యు అయ్ వెన్ (217.7) వరుసగా సిల్వర్, బ్రాంజ్‌ను సొంతం చేసుకున్నారు.
టీమ్ విభాగంలో ఇషా సింగ్ (575)–సురుచి సింగ్ (576)–మను భాకర్ (575)తో కూడిన ఇండియా త్రయం మొత్తం 1726 పాయింట్లతో స్వర్ణాన్ని సాధించింది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో సమర్థ్ రాణా 220.3 పాయింట్లతో మూడో ప్లేస్‌లో నిలిచి కాంస్యం నెగ్గాడు. మెన్స్ జూనియర్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్‌లో గవిన్ అంటోని (240.9) స్వర్ణంతో మెరిశాడు.
