SRH Captain: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ జట్టు కెప్టెన్‌గా యువ వికెట్‌కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ ని నియమించినట్లు ఫ్రాంచైజీ అధికారికంగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రకటించింది. ఐపీఎల్ 2016 విజేతలైన ఎస్‌ఆర్‌హెచ్, ఈ సీజన్ ప్రారంభ మ్యాచ్‌లకు కొత్త కెప్టెన్ తో బరిలోకి దిగబోతుంది. కాగా ప్రస్తుతం జట్టుకు కెప్టెన్‌గా ఉన్న పాట్ కమిన్స్ గాయంతో బాధపడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. కమిన్స్ వెన్నునొప్పి (బ్యాక్ ఇంజరీ) కారణంగా ఐపీఎల్ 2026 ప్రారంభ దశలో మ్యాచ్‌లకు దూరంగా ఉండాల్సి వస్తోంది. దీంతో తాత్కాలికంగా కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు.
ఈ సీజన్‌లో ఇషాన్‌కు డిప్యూటీగా అభిషేక్ శర్మ వ్యవహరించనున్నాడు. ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాల్లో ఉన్న ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును ముందుకు నడిపించనున్నారు. అయితే ఇషాన్ కిషన్ పూర్తి సీజన్‌కు కెప్టెన్‌గా కొనసాగడంలేదు. పాట్ కమిన్స్ తిరిగి జట్టులో చేరిన తర్వాత మళ్లీ నాయకత్వ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కమిన్స్ మార్చి 23వ తేదీన ఎస్ఆర్‌హెచ్ జట్టులో కలిసే అవకాశం ఉంది.
కాగా తొలి మూడు మ్యాచ్‌లకు పాట్ కమిన్స్ దూరంగా ఉండనున్నాడు. ప్రస్తుతం అతను భారత్‌లోనే రిహాబిలిటేషన్ లో ఉన్నాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్ మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు, డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఎం. చిన్నస్వామి స్టేడియంలో పోటీ పడనుంది.
𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨
— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026
Pat Cummins will miss a few games while recovering from injury.
Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG
