టీజర్ : పక్కా మాస్ గా ఇస్మార్ట్ శంకర్

టీజర్ : పక్కా మాస్ గా ఇస్మార్ట్ శంకర్

పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో  ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘ఇస్మార్ట్‌ శంకర్’.  బుధవారం రామ్‌ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. ‘పతా హై మై కౌన్‌ హూ.. శంకర్‌.. ఉస్తాద్‌ ఇస్మార్ట్‌ శంకర్‌’ అని రామ్‌ స్టైల్‌గా తన పేరుని చెప్తున్న డైలాగ్ తో టీజర్‌ మొదలైంది. డ్యాన్స్‌, ఫైటింగ్‌ సీన్స్ లో రామ్‌ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ‘నాతో కిరికిరి అంటే పోచమ్మ గుడి ముంగట పొట్టేలుని కట్టేసినట్లే..’ అని చివర్లో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది.

రామ్ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేశ్‌ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను.. పూరి కనెక్ట్స్‌ బ్యానర్‌పై పూరి జగన్నాథ్‌, ఛార్మి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతుండగా.. రామ్‌, నభాలపై ఓ సాంగ్ ను తెరకెక్కిస్తున్నారు.  మణిశర్మ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాను జులైలో ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తుంది యూనిట్.