అతడి పనితనానికి ఇంప్రెస్​ అయిన దీపికా.. ఆ న్యూస్ వైరల్!

అతడి పనితనానికి ఇంప్రెస్​ అయిన దీపికా.. ఆ న్యూస్ వైరల్!

బాలీవుడ్​ నటి దీపికా పదుకునే(Deepika Padukone) హీరో రణ్​వీర్​సింగ్(Ranveer Singh)​ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పుడే వీరి పెళ్లి బంధానికి ఐదేళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తన పెళ్లి ఫొటోల వెనుక ఓ ఇంట్రెస్టింగ్​ విషయం నెట్టింట వైరలవుతోంది.

రణ్​బీర్​ కపూర్​తో కలిసి ‘యే జవానీ హే దివానీ’లో దీపిక నటించింది. అందులో కబీరా అనే పెళ్లి సాంగ్​ను ప్రముఖ వెడ్డింగ్​ ఫొటోగ్రాఫర్​ విశాల్​ పంజాబీ డైరెక్ట్​ చేశాడట. అతడి పనితనానికి ఇంప్రెస్​ అయిన దీపికా ఓ రోజు అతని క్యాబిన్​కు వెళ్లి నేను పెళ్లి చేసుకునే రోజంటూ వస్తే ఆ మధుర క్షణాల్ని నువ్వే కెమెరాలో బంధించాలి అంటూ చెప్పి వెళ్లిపోయిందట. చెప్పినట్టుగానే తన పెళ్లి వేడుకను విశాల్​తోనే షూట్​ చేయించిందట. దీపిక తన పెళ్లి విషయంలో ఇంత సెంటిమెంట్​తో ఉండటం చూసి అతడు ఆశ్చర్యపోయాడట. 

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటీఫుల్ కపుల్ అంటే గుర్తొచ్చే జంటలలో రణవీర్ సింగ్, దీపికా జోడి ఎప్పటికీ ఎవర్ గ్రీన్. డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహర్ హోస్టింగ్ చేస్తున్న 'కాఫీ విత్ కరణ్’ సీజన్ 8 షోకు తొలిసారిగా వీరు కలిసి వచ్చారు.

తమ ప్రేమ, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. అంతేకాకుండా దాదాపు ఐదేళ్ల తర్వాత తమ పెళ్లి వీడియోను కూడా షేర్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈషోకు సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి.