అల్లు సినిమాస్ లాంటి డాల్బీ థియేటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గర్వకారణం: సీఎం రేవంత్

అల్లు సినిమాస్ లాంటి డాల్బీ థియేటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం గర్వకారణం: సీఎం రేవంత్

హైదరాబాద్ సిటీలో అల్లు సినిమాస్ లాంటి పెద్ద డాల్బీ థియేటర్ ఏర్పాటు చేయడం గర్వకారణం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గురువారం (మార్చి 12) అల్లు సినిమాస్ థియేటర్ ప్రారంభించిన సీఎం.. డాల్బీ థియేటర్ రాష్ట్రానికి, దేశానికి గర్వకారణం అని కొనియాడారు. అందుకోసం కృషి చేసిన అల్లు అరవింద్ ను అభినందించారు. తెలుగు సినిమా హాలీవుడ్ తో పోటీ పడాలని.. అందుకు కావాల్సిన సహాయ సహకరాలు ప్రభుత్వం తరఫున అందిస్తామని ఈ సందర్భంగా సీఎం రేవంత్ చెప్పారు. 

సీఎం రేవంత్ స్పీచ్.:

  • అల్లు రామలింగయ్య వారసత్వాన్ని అల్లు అరవింద్ కొనసాగిస్తున్నారు
  • వారి జ్ఞాపకాలను తెలుగు ప్రజలకు గుర్తుండే విధంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడాన్ని అభినందిస్తున్నా
  • సినిమా సాంకేతికతలో మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది
  • ఒక బాహుబలి, కల్కి, అరుంధతీ లాంటి సాంకేతిక నైపుణ్యంతో సినిమాలు తీసినా దానికి తగినట్లు థియేటర్లు లేకపోతే వృధా
  • అల్లు సినిమాస్ లాంటి పెద్ద డాల్బీ థియేటర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయడం గర్వకారణం
  • చెన్నై నుంచి ఇండస్ట్రీ ఇక్కడికి రావటానికి ఎన్టీఆర్, నాగేశ్వరరావు, రామానాయుడు లాంటి  వారు కృషి చేశారు
  • సినిమా అడ్వెంచర్స్ చేయాలంటే సూపర్ స్టార్ కృష్ణ.. రకరకాల ఎక్స్ పరిమెంట్స్ చేసేవారు.. 
  • ఒక సంవత్సరంలో 15 సినిమాలు తీసేవారు.. ఇప్పుడు ఐదారు సంవత్సరాలకో సినిమా తీసే పరిస్థితి వచ్చింది
  • చదువుకునే రోజుల్లో వనపర్తి నుంచి కర్నూల్ కు లారీలో వెళ్లి సినిమా చూసి వచ్చేవాళ్లం
  • సినిమా జీవితాన్ని ప్రభావితం చేస్తుంది
  • సినిమా కమర్షియల్ ఎలిమెంట్ మాత్రమేకాదు.. 
  • సోషల్ యాంగిల్ లో అత్యంత ప్రభావితం చేయగలిగే ఇండస్ట్రీ ఇది
  • సినిమాను క్యాజువల్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు
  • ఐటీ, ఫార్మా ఇండస్ట్రీతో పాటు సినిమా ఇండస్ట్రీని  కూడా గొప్ప పరిశ్రమగా.. తెలంగాణ అభివృద్ధిలో భాగం చేస్తాం 
  • తెలుగు సినిమా ఇండస్ట్రీని కోలీవుడ్, శాండల్ వుడ్ తో పోటీ కాదు.. హాలీవుడ్ తో పోటీ పడాలి..
  • హాలీవుడ్ సినిమాలు ఇక్కడ తీయగలగాలి.
  • నెట్ ఫ్లిక్స్ ఇక్కడ ప్రారంభం అందుకు ఉదాహరణ
  • కృష్ణా నగర్ నుంచి బాహుబలి లాంటి గొప్ప సినిమాలకు పనిచేసే వరకు వెళ్లిన టెక్నీషియన్లు ఉన్నారు
  • అల్లు అరవింద్ ను చూసి స్వర్గంలో ఉన్న అల్లు రామలింగయ్య గర్వపడుతుంటారు
  • అల్లు అరవింద్ ఒక వ్యక్తిగా ఎదగలేదు.. గీతా ఆర్ట్స్ తో సంస్థాగతం చేశారు
  • వ్యక్తుల సక్సెస్ వెనుక హార్డ్ వర్క్స్ అర్థమైనప్పుడు వ్యక్తుల పట్ల గౌరవం పెరుగుతుంది
  • సినిమా సక్సెస్, ఫెయిల్ అనేది మ్యాటరే కాదు 
  • దాని వెనుక కఠోర శ్రమను గుర్తించాలి
  • అవతార్, జురాసిక్ పార్క్ లాంటి టెక్నికల్ సినిమాలు తీస్తూ హాలీవుడ్ తో పోటీ పడాలి