తమిళ మూవీ ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌‌లో పవన్‌‌

తమిళ మూవీ ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌‌లో పవన్‌‌

‘హరిహర వీరమల్లు’ సెట్స్​పై ఉంది. ‘భవదీయుడు భగత్‌‌సింగ్’ లైన్‌‌లో ఉంది. అయితే వీటి గురించి మానేసి పవన్‌‌ కళ్యాణ్‌‌ చేయబోయే మరో సినిమా గురించి చర్చ నడుస్తోంది ఇండస్ట్రీలో. తమిళ మూవీ ‘వినోదాయ సిత్తం’ రీమేక్‌‌లో పవన్‌‌ నటించనున్నారని, సాయితేజ్ మరో కీలక పాత్ర పోషిస్తాడని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అనౌన్స్‌‌మెంట్ అయితే రాలేదు కానీ ఈ ప్రాజెక్ట్ కన్‌‌ఫర్మ్ అయిన సంగతి పవన్ సన్నిహితుల ద్వారా బైటికి వచ్చింది. రీసెంట్‌‌గా పూజ కూడా జరగడంతో ఈ మూవీ షూటింగును సీక్రెట్‌‌గా స్టార్ట్ చేసేశారని అనుకున్నారంతా. కానీ అది నిజం కాదు. కేవలం పూజ మాత్రమే జరిగిందట. షూటింగ్ మాత్రం ఈ నెల 12 నుంచి మొదలవుతుందని సమాచారం. తమిళ వెర్షన్‌‌ను తీసిన సముద్రఖనియే తెలుగులోనూ డైరెక్ట్ చేయనున్నారట. త్రివిక్రమ్ ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారని, త్వరలోనే అఫీషియల్‌‌గా మూవీని ప్రకటిస్తారని అంటున్నారు. అంతేకాదు.. ఈ సినిమాని రెండే రెండు షెడ్యూల్స్​తో పూర్తి చేసేస్తారని తెలిసింది. పవన్ మొదటి షెడ్యూల్‌‌లో పదిహేను రోజుల పాటు కంటిన్యుయస్‌‌గా పాల్గొని, రెండో షెడ్యూల్‌‌లో మరో పదిహేను రోజుల పాటు వర్క్ చేస్తారట. ‘హరిహర వీరమల్లు’ను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ‘భవదీయుడు భగత్‌‌సింగ్’ షూట్‌‌లో జాయినయ్యేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నారట. ఈ వార్తల్లో ఎంత నిజముందో టీమ్ నుంచి ఎవరో ఒకరు కన్‌‌ఫర్మ్ చేస్తారేమో చూడాలి.