హైదరాబాద్ లో ఆరు చోట్ల ఐటీ సోదాలు..

హైదరాబాద్ లో ఆరు చోట్ల ఐటీ సోదాలు..

హైదరాబాద్ లో ఆరు చోట్ల ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా హైటెక్ సిటీ, కూకట్ పల్లిలోని ప్రయివేటు కంపెనీలు, ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. ఆర్ఎస్ బ్రదర్స్ కి సంబంధించిన కార్యాలయాలు, ఇళ్లలో ఐటీ సోదాలు చేపట్టింది. ఇటీవల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఆర్ ఎస్ బ్రదర్స్ పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. దీంతో పాటు కూకట్ పల్లిలోని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ లోనూ ఐటీ బృందం తనిఖీలు చేపట్టినట్టు తెలుస్తోంది.

 హానర్స్ రియల్ ఇన్ఫ్రా పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న ఆర్ఎస్ బ్రదర్స్... వాసవితోపాటు పలు ప్రాజెక్టులు చేపట్టింది. కూకట్ పల్లిలోని గల్ఫ్ ఆయిల్ ల్యాండ్ వివాదాల్లోనూ హానర్స్ జోక్యం చేసుకున్నట్టు సమాచారం. ఆర్ఎస్ బ్రదర్స్ తో పాటు హానర్స్, సుమధుర, వాసవిల పరంపర ఆర్ఎస్ లపైనా ఐటీ సోదాలు నిర్వహిస్తోంది. ఆర్ఎస్ బ్రదర్స్ ఇప్పటికే వాసవి, సుమధురతో కలిసి పలు వ్యాపారాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.