Surekha Vani: 'మా అమ్మాయికే పెళ్లి వయసొచ్చింది..' రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి!

 Surekha Vani: 'మా అమ్మాయికే పెళ్లి వయసొచ్చింది..' రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన సురేఖావాణి!

తెలుగు సినీ ఇండస్ట్రీలో తన నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. ప్రస్తుతం టాలీవుడ్ లో సినిమా అవకాశాలు తగ్గినా కోలీవుడ్ లో మాత్రం ఫుల్ బిజీగా ఉంది. సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. తన ఫొటోలు, వీడియోలతో అభిమానులను అలరిస్తోంది. అయితే లేటెస్ట్ తన వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లో నిలిచారు. 

కోలీవుడ్ లో బిజీగా..

తమిళంలో సురేఖావాణి నటించిన 'నీరమ్' చిత్రం తెలుగులోనూ డబ్బింగ్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో ఆమె వ్యక్తిగత జీవితంపై, ముఖ్యంగా రెండో పెళ్లిపై వచ్చిన ప్రశ్నకు ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానం చెప్పడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

 

రెండో పెళ్లిపై క్లారిటీ..

'మీ కుమార్తె సుప్రీత గతంలో మీకు ఇష్టమైతే రెండో పెళ్లి చేస్తానని చెప్పింది. ఇప్పుడు మీ నిర్ణయం ఏమిటి?' అని ఓ రిపోర్టర్ ప్రశ్నించారు. దీనికి సురేఖావాణి నవ్వుతూ .. ఆ ఆలోచనే లేదు. ఉంటే ఇన్నేళ్లు వేచి ఉండేదాన్ని కాదు. ఇప్పుడు కూడా లేదు.. ఇక ముందు కూడా ఉండదనుకుంటున్నా. మా అమ్మాయికే పెళ్లి చేసే వయసొచ్చింది. అలాంటి సమయంలో నేనెందుకు పెళ్లి చేసుకుంటాను? నా పెళ్లి అయితే మీడియా వాళ్లు ఎప్పుడో చేసేశారు.. వార్తలు కూడా రాసేశారు అంటూ చమత్కరించారు.

 

నా జీవితం నా ఇష్టం..

సోషల్ మీడియాలో తనపై వచ్చే ట్రోలింగ్‌పై కూడా సురేఖావాణి ఘాటుగానే స్పందించారు. నాకు నచ్చిన ఫొటోలు, వీడియోలు నేను పోస్ట్ చేస్తాను. ఎలా ఫొటో దిగాలనిపిస్తే అలా దిగుతాను. చుట్టుపక్కల వాళ్లు ఏమనుకుంటారో నాకు అవసరం లేదు. మొదట్లో నెగిటివ్ కామెంట్లు బాధించేవి. కానీ ఇప్పుడు వాటిని పూర్తిగా పట్టించుకోవడం మానేశాను. నా జీవితం నా ఇష్టం అని స్పష్టం చేశారు.

 

తెలుగులో అవకాశాలు ఇస్తే...

వెండితెరపై అక్క, వదిన, తల్లి వంటి ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించిన సురేఖావాణి.. తన కూతురు సుప్రీతతో కలిసి సోషల్ మీడియాలో చేసే గ్లామరస్ పోస్టుల కారణంగా తరచూ ట్రెండింగ్‌లో ఉంటుంటారు. ఇదే కారణంగా గత కొంతకాలంగా ఆమె రెండో పెళ్లిపై అనేక రూమర్లు చక్కర్లు కొట్టాయి. అయితే లేటెస్ట్ వ్యాఖ్యలతో ఆ ప్రచారాలకు ఆమె పూర్తి స్థాయిలో చెక్ పెట్టినట్టైంది. అదే సమయంలో తనకు ఇంకా మంచి పాత్రలు చేయాలనే ఆసక్తి ఉందని, తెలుగు దర్శక నిర్మాతలు అవకాశం ఇస్తే మరిన్ని విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరిస్తానని ఆమె కోరింది.