లిప్​లాక్ తెచ్చిన తంటా..

లిప్​లాక్ తెచ్చిన తంటా..

బాలీవుడ్​లో నటి ఆకాంక్ష పూరి(Akanksha Puri-)  వ్యవహారం హాట్​ టాపిక్​గా మారింది. బిగ్​బాస్​ ఓటీటీ 2(Bigg Boss OTT 2) లో ఆమె కంటెస్టెంట్​గా పాల్గొంది. ఇందులో  జైద్ (Jaid Hadid)​​ అనే నటుడికి ఆమె లిప్​లాక్​ ఇవ్వడంపై వివాదం రాజుకుంది. కెమెరాలు ఉన్నాయన్న విషయం మరిచి వీరిద్దరూ ప్రవర్తించిన తీరుపై ఆడియెన్స్​ మండిపడుతున్నారు. ఈ షోను బ్యాన్​ చేయాలని  డిమాండ్​ చేస్తున్నారు. 

దీంతో షో హోస్ట్​ సల్మాన్​ ఖాన్(Salman Khan) ​ ఆకాంక్ష పూరిని ఎలిమినేట్​ చేశాడు. బయటకు వచ్చిన ఈ నటి చిన్న లిప్​లాక్ కు​ ఇంత రాద్దాంతం అవుతుందనుకోలేదని తెలిపింది. టాస్క్​లో భాగంగానే అలా చేశానని.. జైద్​కి ముద్దుపెట్టే ఇంట్రస్ట్​ తనకు ఏమాత్రం లేదని పేర్కొంది. 

ఇటీవల జైద్​ ఆకాంక్షను తన అనుమతి లేకుండా దగ్గరకు లాక్కోవడంపైనా నెట్టింట కాంట్రవర్సీ అయ్యింది. ఇప్పుడు అతను కూడా 4 రోజుల్లో బయటకు వచ్చే చాన్స్​ ఉంది.