
జబర్దస్త్(Jabardasth) షోలో కమెడియన్ గా కెరీర్ ప్రారంభించిన వేణు(Venu) ఇప్పుడు క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు. అయన తెరకెక్కించిన మూవీ బలగం(Balagam). చిన్న సినిమాగా, అసలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజైన ఈ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పల్సిన పనిలేదు. తెలంగాణ ప్రాంతంలో ఉండే మనుషులు, వారి భావోద్వేగాలను చాలా అద్భుతంగా చూపించారు దర్శకుడు వేణు. ఈ సినిమా కేవలం అద్భుతమైన విజయాన్ని మాత్రమే కాదు.. అంతర్జాతీయ వేదికలపై ఎన్నో అవార్డ్స్ కూడా దక్కించుకుంది.
అయితే తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే.. బలగం వేణు లాగే ఇప్పుడు మరో జబర్దస్త్ కమెడియన్ కూడా మెగా ఫోన్ పట్టుకోవడానికి సిద్దమయ్యాడట. ఆ కమెడియన్ మరెవరో కాదు ధనరాజ్(Danraj). ఈ కమెడియన్ తన సినిమా కోసం విలేజ్ బ్యాక్డ్రాప్ లో సాగే ఎమోషనల్ కథాంశాన్ని ఎంచుకున్నారట. దసరా పండుగరోజు ఈ సినిమా అధికారికంగా ప్రారంభం కానుందని సమాచారం. తమిళ నటుడు, దర్శకుడు సముద్రఖని(Samuthirakani) ఈ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారట. అయితే ఈ ప్రాజెక్టు కు సంబందించిన అధికారిక ప్రకటన, ఇతర వివరాలు త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్. మరి బలగం వేణు లాగే ధనరాజ్ కూడా దర్శకుడిగా రాణిస్తాడా అనేది చూడాలి మరి.