‘జబర్దస్త్’ కమెడియన్ ఇమాన్యుయేల్ లీడ్ రోల్లో చెందు ముద్దు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేశారు. దర్శకురాలు నందినీ రెడ్డి పోస్టర్ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇందులో ఇమాన్యుయేల్ కనిపించిన తీరు, పక్కనే కానిస్టేబుల్, పోస్టర్లో కనిపిస్తున్న సంకెళ్లు, ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారుతి రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ రివీల్ చేస్తామని మేకర్స్ చెప్పారు.
