కేసీఆర్ టైటిల్తో సినిమా .. హీరోగా కమెడియన్

కేసీఆర్ టైటిల్తో సినిమా .. హీరోగా కమెడియన్

జబర్దస్త్ షోతో కమెడియన్ గా  తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న  రాకింగ్ రాకేష్ హీరోగా మారుతున్న సంగతి తెలిసిందే.  గ్రీన్ టీ ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో విభూది క్రియేషన్స్ పతాకంపై అంజి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తూన్నారు. తాజాగా ఈ సినిమాకు టైటిల్ అనౌన్స్ చేశారు.   ఈ చిత్రానికి కేసీఆర్ (కేశవ్ చంద్ర రమావత్) అనే టైటిల్ ను పెట్టారు.  

మంత్రి మల్లారెడ్డి చేతులు మీదగా మల్లారెడ్డి యూనివర్సిటీలో 50 అడుగుల కటౌట్ తో 50,000 మంది స్టూడెంట్స్ సమక్షంలో ఈ టైటిల్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ పోస్టర్ చూస్తుంటే తెలంగాణ బ్యాక్‌డ్రాప్ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రాకేష్ సరసన  అనన్య హీరోయిన్ గా నటిస్తుంది.  కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మరి  హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడో చూడాలి.