బాలయ్యపై ఓడిన అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్

బాలయ్యపై ఓడిన అభ్యర్థికి జగన్ బంపర్ ఆఫర్

హిందూపురం నుంచి బాలయ్యపై ఓడిన వైఎస్సార్సీపీ అభ్యర్థి మాజీ పోలీస్ అధికారి ఇక్బాల్ కు సీఎం జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. గుంటూరులో ముస్లీంలకు ఇచ్చిన ఇఫ్లార్ విందులో పాల్గొన్న జగన్..ఇక్బాల్ కు ఎమ్మెల్సీ ఇస్తున్నట్లు హామీ ఇచ్చారు. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి ఐదుగురు మైనార్టీలకు టికెట్ ఇస్తే నలుగురు గెలిచారని..ఇక్బాల్ ఒక్కడే ఓడిపోయినందున ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి  న్యాయం చేస్తానని అన్నారు. అంతేగాకుండా ఎన్నికల్లో గెలిచిన మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తామన్నారు జగన్.