
నితిన్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమి గౌడ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సీనియర్ నటి లయ ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తోంది. జులై 4న సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి డివోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. అజనీష్ లోకనాథ్ సాంగ్ కంపోజ్ చేయగా, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు లిరిక్స్ రాశారు. అబీ వీ ఆకట్టుకునేలా పాడారు.
‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, జై జయకారిణీ, విద్రుమ రూపిణి, విభ్రమ కారిణి, గగనఛత్ర వింధ్యాచలవాసిని, వీర విహారిణి, క్షుద్ర విదారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ.. కొండ కోనలందుండి కోటి బ్రహ్మాండములేలే శివనారీ.. గుండె గుండెలో అఖండ జ్యోతిగా వెలుగుచుండు ఓంకారి.. మంగళకారిణి మాలినీ మమ్మేలవె మధుశాలినీ..మా గ్రామశ్వేరి.. సంగ్రామేశ్వరి.. మాయావృత మహిషాసురమర్దిని’ అంటూ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారి మహిమను కీర్తిస్తూ గ్రామ జాతర వేడుక సందర్భంగా సాగిన ఈ పాటలో లయతో పాటు బేబీ శ్రీరామ్ దిత్య కనిపించిన తీరు ఆకట్టుకుంది.