మరో ఇంట్రెస్టింగ్​ ప్రాజెక్ట్​లో జైభీమ్​ సినతల్లి..

మరో ఇంట్రెస్టింగ్​ ప్రాజెక్ట్​లో జైభీమ్​ సినతల్లి..

సూర్య(Suriya) ప్రధాన పాత్రలో వచ్చిన ‘జైభీమ్’​(Jai Bhim) సినిమా విమర్శకుల ప్రశంసలందుకున్న సంగతి తెలిసిందే. ఇందులో గిరిజన యువతిగా మెప్పించిన నటి లిజోమోల్​ జోస్ (Lijomol Jose)​. న్యాయం కోసం పోరాడే మహిళగా ఆమె పాత్ర సినిమాకు హైలెట్​గా నిలిచింది. పూర్తిస్థాయి డీ గ్లామరస్​ రోల్​లో కనిపించి మెప్పించింది.

గతంలో సిద్ధార్థ్​ హీరోగా వచ్చిన ‘ఒరేయ్​ బామ్మర్థి’లోనూ కీ రోల్​ చేసింది. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్​ మూవీలో జోస్​ నటిస్తోంది. తమిళంలో విభిన్న సినిమాలతో పాపులర్​అయిన నటుడు శశికుమార్​తో ఈ బ్యూటీ సినిమా చాన్స్​ కొట్టేసింది. 1990 బ్యాక్​డ్రాప్​లో ఓ థ్రిల్లింగ్​ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తేనున్నట్టు మూవీ టీం తెలిపింది. ఈ మూవీని సత్యశివ డైరెక్ట్ చేస్తున్నాడు. విజయగణపతి పిక్చర్స్‌పై పాండియన్ పరశురామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ తమిళ సినిమా షూటింగ్ జరుగుతోంది.

లిజోమోల్ జోస్..అంటే ఎవరా..అని కాసేపు ఆలోచిస్తారు. కానీ, జై భీమ్ ​లో ‘సినతల్లి’ అంటే మాత్రం టక్కున గుర్తొచ్చేస్తుంది. ‘‘ఆమె నటన, ఎక్స్​ప్రెషన్స్​, నేచురాలిటీ...వావ్​! వాట్​ ఏ పర్ఫార్మెన్స్​..అనకుండా ఉండలేరు. అంత బాగా నటించింది ఆ సినిమాలో. మీడియాలో పనిచేసిన లిజో..అనుకోకుండానే సినిమాల్లోకి వచ్చింది. కాకపోతే ఏ రంగంలోనైనా రాణించగల సత్తా ఉంటే..ఇక వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేదని నిరూపించింది. దీంతో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ సినిమాల్లో రాణిస్తుంది. .