ధాన్యం ఆల్ టైం రికార్డు రేటు.. జైశ్రీరాం వడ్లు క్వింటాల్ రూ.5వేలు

ధాన్యం ఆల్ టైం రికార్డు రేటు.. జైశ్రీరాం వడ్లు క్వింటాల్  రూ.5వేలు
  • మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మార్కెట్​లో ఆల్​టైమ్ రికార్డ్ రేటు
  • మక్కలకూ భారీ ధర.. క్వింటాల్​కు రూ.3,036 

నెల్లికుదురు (కేసముద్రం)/ మహబూబాబాద్, వెలుగు: జైశ్రీరాం రకం వడ్లు రికార్డు ధర పలికాయి. మహబూబాబాద్​జిల్లా కేసముద్రం మార్కెట్ కు గతేడాది సాగు చేసిన జైశ్రీరాం రకానికి చెందిన ఐదు బస్తాల వడ్లను ఓ రైతు శుక్రవారం అమ్మకానికి తెచ్చారు. ఈ–నామ్  విధానంలో వడ్లను వేలం వేయగా క్వింటాల్​వడ్లు రూ.5,016 ఆల్​టైమ్​రికార్డ్ ధర లభించింది. కేసముద్రం మార్కెట్​లో ఇతర పంటలకూ భారీ ధర పలికింది. ఆర్ఎన్ఆర్​ రకం వడ్లకు గరిష్టంగా క్వింటాల్​కు రూ.4,782 రేటు వచ్చింది. మక్కలకు కూడా రికార్డ్​ ధర లభించింది. వీటికి క్వింటాల్​కు గరిష్టంగా రూ.3,036, కనిష్టంగా రూ.2,461 రేటు పలికింది. పత్తి క్వింటాల్ రూ.9,111, కందులు రూ.10,989, పెసర్లరు రూ.7,916 రేటు పలికింది.