దరువు మార్చి కొత్త సౌండ్ తో.. చిరు జామ్ జామ్ జజ్జనక

దరువు మార్చి కొత్త సౌండ్ తో.. చిరు జామ్ జామ్ జజ్జనక

మెగాస్టార్ చిరంజీవి(Megatsar Chiranjeevi) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘భోళా శంకర్’(Bhola Shankar). మెహర్ రమేష్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ పై మెగా అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు.

తాజాగా ఈ మూవీ నుంచి సెకండ్ లిరికల్ రిలీజ్ చేశారు మేకర్స్. జామ్ జామ్  జజ్జనక..అంటూ సాగే ఈ  గీతంలో తమ్ముళ్లు మనకు కొంచెం చేంజ్ కావాలి..దరువు మార్చి కొత్త సౌండ్ వేసుకోండి అని చిరు వాయిస్ ఇవ్వగా..నర్సపెల్లె..గండిలోన గంగాధారి.. నాటుపిల్లే.. కలిసినాది గంగాధారి..లిరిక్స్ ఆసక్తి కలిగిస్తున్నవి. కాసార్ల శ్యామ్ రాసిన ఈ గీతం అనురాగ్ కులకర్ణి, మంగ్లీ పాడారు.

మెగాస్టార్ చిరు, తమన్నా, కీర్తి సురేష్,సుశాంత్ డ్యాన్స్ తో ఈ గీతం జోరు పెరిగింది. మహతి స్వర సాగర్ అందించిన మ్యూజిక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. శేఖర్ మాస్టర్ కోరియోగ్రఫీ చిరు ప్రత్యేక స్టెప్పులతో హంగామా కనబరుస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ సాంగ్ తో మరింత ఆకర్షణ రావడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ఇప్పటికే  రిలీజ్ అయిన  భోళా మేనియా సాంగ్ మెగా అభిమానులని ఊపేస్తోంది.

మెగాస్టార్ చిరంజీవికు జోడీగా తమన్నా నటిస్తోండగా కీర్తి సురేష్, సుశాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తుండగా..ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 11న విడుదలవుతోంది.