
కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో హరిష్ రెడ్డి ఉప్పుల తెరకెక్కిస్తున్న చిత్రం ‘జిగ్రీస్’. మౌంట్ మెరు పిక్చర్స్ బ్యానర్‌పై కృష్ణ వోడపల్లి నిర్మిస్తున్నారు. శనివారం ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుడు సందీప్ రెడ్డి వంగా లాంచ్ చేసి, టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పాడు.
ఈ పోస్టర్‌లో ఓ వింటేజ్ మారుతి 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఆకట్టుకుంది. చిన్ననాటి స్నేహితులు, నోస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ నేపథ్యంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ ఈ సందర్భంగా తెలియజేశారు. కమ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.