విజయ్ 'జననాయగన్'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 'A' సర్టిఫికెట్‌తో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్!

విజయ్ 'జననాయగన్'కు సెన్సార్ గ్రీన్ సిగ్నల్.. 'A'  సర్టిఫికెట్‌తో ఫ్యాన్స్‌కు ఊహించని షాక్!

కోలీవుడ్ హిస్టరీలోనే ఎన్నడూ లేని విధంగా దాదాపు ఏడు నెలల పాటు సాగిన హైడ్రామాకు ఎట్టకేలకూ తెరపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి, దళపతి విజయ్ పొలిటికల్ ఎంట్రీకి ముందు నటించిన ఆయన లాస్ట్ అండ్ ఫైనల్ మూవీ 'జననాయగన్' (Jana Nayagan). ఎట్టకేలకు ఈ మూవీకి సెన్సార్‌ బోర్డు (CBFC) నుండి గ్రీన్ సిగ్నల్ సాధించింది. అయితే ఈ క్లియరెన్స్ వెనుక విజయ్ ఫ్యాన్స్‌కు మైండ్ బ్లాక్ అయ్యే ఒక ఊహించని షాక్ తగిలింది.

'A 'సర్టిఫికేట్.. 

నందమూరి బాలకృష్ణ నటించిన తెలుగు సూపర్ హిట్ మూవీ 'భగవంత్ కేసరి'కి రీమేక్‌గా వస్తున్న ఈ చిత్రానికి ఒరిజినల్‌లో U/A సర్టిఫికేట్ వచ్చింది. కానీ హెచ్. వినోద్ డైరెక్షన్‌లో విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా పొలిటికల్ అండ్ యాక్షన్ ఎలిమెంట్స్‌తో 'జననాయగన్'  స్క్రిప్ట్‌లో భారీ మార్పులు చేయడంతో.. ఈ రీమేక్‌కు 'A'(Adults Only) సర్టిఫికేట్ జారీ అయింది. సినిమా రన్ టైమ్ కూడా ఏకంగా 3 గంటల 3 నిమిషాలు ఉండటం విశేషం. దళపతి చివరి సినిమాలో ఊరమాస్ యాక్షన్, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో చెప్పడానికి ఈ 'A' సర్టిఫికేటే నిదర్శనం.

 

ఎన్నో అడ్డంకులు.. వివాదాలు..

జనవరి 9న సంక్రాంతి కానుకగా, అలాగే ఏప్రిల్‌లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందే ఈ 'జననాయగన్' సినిమా రిలీజ్ కావాల్సింది. కానీ ఈ సినిమా ప్రయాణంలో ఎదురైన అడ్డంకులు అన్నీ ఇన్నీ కావు.సినిమాలో ఉన్న కొన్ని డైలాగులు, సీన్లు విజయ్ పొలిటికల్ కెరీర్‌కు మైలేజ్ ఇచ్చేలా ఉన్నాయంటూ సెన్సార్ బోర్డు మెంబర్ ఒకరు అభ్యంతరం పెట్టడంతో వివాదం మొదలైంది. దీంతో ప్రొడక్షన్ హౌస్ KVN ప్రొడక్షన్స్ మద్రాస్ హైకోర్టుకు, ఆపై సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా ఫలితం లేకపోయింది. చివరికి పిటిషన్ వెనక్కి తీసుకుని రివైజింగ్ కమిటీకి వెళ్లాల్సి వచ్చింది.

పైరసీ భూతం..

వివాదాల మధ్య మరో షాకింగ్ ఘటన కూడా చోటుచేసుకుంది. సినిమా సెన్సార్ పూర్తికాకముందే  ఎడిటింగ్ రూమ్ నుండి హైక్వాలిటీ పైరసీ వెర్షన్ ఆన్‌లైన్‌లో ప్రత్యక్షమైంది. దాదాపు 1.2 కోట్ల మంది ఆ కాపీని చూసినట్లు కోర్టులో వెల్లడించడం ఇండస్ట్రీని షాక్‌కు గురి చేసింది. ఈ కేసులో పలువురిని తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల నకిలీ CBFC సర్టిఫికెట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది.

రిలీజ్ ఎప్పుడంటే?

ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోవడంతో జూలై 23 లేదా 24న సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు జూలై 24 రిలీజ్ డేట్‌ను లాక్ చేసినట్లు పోస్ట్ కూడా చేశారు.  హెచ్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో పూజా హెగ్డే, బాబీ డియోల్, మమితా బైజు, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ప్రకాశ్ రాజ్, నరేన్ కీలక పాత్రలు పోషించారు. పూర్తి స్థాయి రాజకీయ జీవితంలోకి అడుగుపెట్టే ముందు విజయ్ నటిస్తున్న చివరి చిత్రంగా కావడంతో 'జన నాయకన్'పై ఇప్పుడు అంచనాలు మరింత పెరిగాయి.  బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.