Jananayagan OTT: ఓటీటీ టాప్ ట్రెండింగ్లో ‘జననాయగన్’.. విజయ్ చివరి సినిమా ఎక్కడ చూడాలంటే?

Jananayagan OTT: ఓటీటీ టాప్ ట్రెండింగ్లో  ‘జననాయగన్’.. విజయ్ చివరి సినిమా ఎక్కడ చూడాలంటే?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జననాయగన్’ ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 23, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా.. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చింది. విజయ్ చివరి చిత్రం కావడంతో ఈ మూవీ ఓటీటీ రిలీజ్‌పై అభిమానుల్లో మొదటి నుంచే ఆసక్తి నెలకొంది.

ఓటీటీలోకి ‘జననాయగన్’.. 

‘జననాయగన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే నేటి నుంచి సినిమాను ఓటీటీలో స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చింది. ఒరిజినల్ తమిళ వెర్షన్‌తో పాటు తెలుగు డబ్బింగ్ సహా పలు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ప్రస్తుతం జీ5 టాప్ ట్రెండింగ్ లో దూసుకెళ్తోంది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన ప్రేక్షకులు ఇప్పుడు ఓటీటీలో ఫుల్ ఎంటర్ టైన్ అవుతున్నారు. విజయ్-పూజా హెగ్డే జోడీని ఎంజాయ్ చేస్తున్నారు. విశ్వనాధ్ & సన్స్ తో మరో హిట్ అందుకున్న మమితా బైజు నటనకు ఫిదా అవుతున్నారు.

బాక్సాఫీస్ వద్ద మిక్సెడ్ టాక్..

భారీ అంచనాల మధ్య విడుదలైన ‘జననాయగన్’ బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయింది. పైరసీ లీకులు సినిమాకు ప్రతికూలంగా మారడంతో పాటు.. ఈ చిత్రం ‘భగవంత్ కేసరి’ రీమేక్ అనే ప్రచారం తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై ఆసక్తిని కొంత తగ్గించింది. దీంతో తెలుగు మార్కెట్‌లో కలెక్షన్లపై ప్రభావం పడింది.

ALSO READ : ఇండియన్ మగాళ్లు వేస్ట్? యూరోపియన్ మెన్స్ బెస్ట్...

అయితే తమిళనాడులో విజయ్‌కు ఉన్న భారీ క్రేజ్ సినిమాకు కలిసొచ్చింది. అక్కడ మంచి వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.321 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. బాక్సాఫీస్ ఫలితం ఎలా ఉన్నప్పటికీ.. విజయ్ కెరీర్‌లో చివరి చిత్రంగా ‘జననాయగన్’ అభిమానులకు మాత్రం ప్రత్యేకంగా నిలిచిపోయింది.