
మ్యాన్ అఫ్ మాసెస్ ఎన్టీఆర్(Ntr) ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్న సినిమా దేవర(Devara). స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Siva) తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించబోయే సంగీతంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భారీ లెవల్లో అంచనాలు పెట్టేసుకున్నారు.
ఇప్పటికే ఫియర్ సాంగ్ మోగించే మోతకు బాక్సులు ధడేల్ అన్నాయి. రాకే ఎగబడి రాక్..దూకే ధైర్యమా జాగ్రత్త అంటూనే భయం పుట్టించిన దేవర నుండి కూల్ చేసే రొమాంటిక్ సాంగ్ రాబోతుంది. నేడు ఆగస్టు 5న ఎన్టీఆర్, జాన్వీ కపూర్ మీద తెరకెక్కించిన ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ని విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో దేవర మేకర్స్ సెకండ్ సాంగ్కి సంబంధించిన వరుస పోస్టర్స్ ను రిలీజ్ చేసే పనిలో పడ్డారు. ఈ మేరకు తాజా పోస్టర్ లో కొండలోయల్లో జారే జలపాతాల నడుమ ఎన్టీఆర్, జాన్వీ మరో రొమాంటిక్ స్టిల్ని మేకర్స్ చూపించారు. 'మేము ఇప్పటికే ట్రాన్స్‌లో ఉన్నాము..బ్లడీ ష్యూర్ మీరు కూడా సాయంత్రం 5:04 నుండి ఈ రైడ్‌లో మాతో చేరతారు' అంటూ దేవర టీమ్ వెల్లడించింది. ఇక సాయంత్రం 5:04 నిమిషాలకి రానున్నఈ రొమాంటిక్ సాంగ్ ఎలాంటి రికార్డ్స్ నెలకొల్పనుందో చూడాలి.
A unanimous chartbuster is on the way ?
— Devara (@DevaraMovie) August 5, 2024
You'll be saying this from 5:04PM ?#Chuttamalle #DheereDheere #Paththavaikkum #SwaathimuttheSikkangaithe #KanninathanKamanottam#DevaraSecondSingle #Devara pic.twitter.com/Ul9HVA1idM