రొమాంటిక్ థ్రిల్లర్లో జాన్వీకపూర్.. మరో హీరోయిన్గా శ్రీలీల

 రొమాంటిక్ థ్రిల్లర్లో జాన్వీకపూర్.. మరో హీరోయిన్గా శ్రీలీల

కొత్త సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగేస్తున్న బాలీవుడ్ హీరోయిన్ జాన్వీకపూర్.. సైలెంట్‌‌గా ఓ రొమాంటిక్‌‌ థ్రిల్లర్‌‌‌‌ షూటింగ్ స్టార్ట్ చేసింది.  ఉమేష్‌‌ బిస్త్‌‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. శుక్రవారం నైనిటాల్‌‌లో ఈ మూవీ షూటింగ్ మొదలైంది. సిద్ధార్థ్ గుప్తా హీరోగా న‌‌టిస్తున్నాడు. ఏక్తాక‌‌పూర్‌‌, గునీత్ మోంగా క‌‌లిసి నిర్మిస్తున్నారు. శ్రీలీల ఇందులో మరో హీరోయిన్‌‌గా నటిస్తుండటం విశేషం. 

ఒకే అబ్బాయితో ప్రేమలో పడ్డ ఇద్దరమ్మాయిల ట్రయాంగిల్ లవ్‌‌ స్టోరీతో దీన్ని తెరకెక్కిస్తున్నారు. ఇద్దరి పాత్రలు పోటాపోటీగా ఉండబోతున్నాయి. ప్రేక్షకుల ఊహకందని ట్విస్ట్‌‌ లు, సర్‌‌‌‌ప్రైజింగ్‌‌ ఎలిమెంట్స్‌‌ తో ఈ మూవీ థ్రిల్ చేయబోతుందట. 

ఇందులో జాన్వీకపూర్ ఇప్పటివరకు నటించని కొత్త తరహా పాత్రలో కనిపిస్తుందని, తన క్యారెక్టర్‌‌ కొంత‌‌ నెగెటివ్ షేడ్స్‌‌ తో ఉండబోతోందని తెలుస్తోంది. ‘పెద్ది’లో తన పాత్రకు విమర్శలు వచ్చిన నేపథ్యంలో తనను తాను కొత్తగా ప్రజెంట్‌‌ చేసుకునేందుకు ఈ తరహా ప్రయోగాత్మక పాత్రలకు ఓకే చెపుతోందట జాన్వీ కపూర్.  దీంతో పాటు టైగర్‌‌‌‌ ష్రాఫ్‌‌, లక్షతో కలిసి ‘లగ్ జా గలే’ అనే యాక్షన్‌‌ ఎంటర్‌‌‌‌టైనర్‌‌‌‌లో ఆమె నటిస్తోంది.