ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, యంగ్ డైరెక్టర్అట్లీ కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం 'రాకా' (Raaka). ఈ మూవీపై రోజు రోజుకు అంచనాలు రెట్టింపు అవుతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దాదాపు రూ1,000 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ మైండ్ బ్లోయింగ్ సైన్స్ ఫిక్షన్ విజువల్ వండర్, రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
భారీ అంచనాలతో..
ఇటీవల విశాఖపట్నంలో జరిగిన తన థియేటర్ ప్రారంభోత్సవంలో బన్నీ మాట్లాడుతూ.. నేను నేరుగా రాకా ముంబై షూటింగ్ సెట్ నుంచే ఇక్కడికి వచ్చాను అని చెప్పడంతో అల్లు అర్జున్ అభిమానుల జోష్ రెట్టింపు అయింది. ఈ చిత్రానికి సాయి అభ్యంగ్కర్ సంగీతం అందిస్తున్నారు..ఈ చిత్రం 2027 డిసెంబర్‌లో వరల్డ్ వైడ్‌గా విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది. అయితే ఈ చిత్రంలో నటీనటుల పాత్రల గురించి బయటకొచ్చిన లీక్స్ నెట్టింట వైరల్ అవుతోంది..
ప్రెగ్నెన్సీలో దీపికా ..
నిజ జీవితంలో ప్రెగ్నెన్సీతో ఉన్న దీపికా పడుకోణ్.. ఈ సినిమాలో కూడా గర్భవతిగా శక్తివంతమైన పాత్రలో కనిపించనుంది. పురాణ వైదిక కాలం నేపథ్యంలో సాగే ఈ కథలో ఆమె మనుగడ కోసం చేసే పోరాటం సినిమాకి ప్రధాన బలంగా నిలవనుందని తెలుస్తోంది . ఇప్పటికే దాదాపు దీపికా షెడ్యూల్ పూర్తయినట్లు సమాచారం.
గిరిజన రాణి పాత్రలో జాన్వీ..
ఇక ఈ మూవీలో జాన్వీకపూర్, రష్మిక మందన్న కూడా నటిస్తున్నట్లు గట్టిగా టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మేకర్స్ ఇంకా అధికారిక ప్రకటన మాత్రం చేయలేదు. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ గిరిజన రాణి పాత్రలో, అత్యంత శక్తివంతమైన డైనమిక్ లీడర్‌గా నటించనుందని సమాచారం. ఇక దీపికా పాత్రకు రక్షకురాలిగా, మార్గదర్శిగా డేంజరస్ వరల్డ్‌లో ఆమెను కాపాడే కీలక పాత్రలో రష్మిక మందన్న అలరించనుందని టతాక్ వినిపిస్తోంది..
డ్యూయల్ టైమ్‌లైన్ మేజిక్..
ఈ చిత్రం రెండు వేర్వేరు కాలాల నడుమ సాగనుంది. ఒక వైపు ప్రాచీన వైదిక గిరిజన సంస్కృతి, మరోవైపు అత్యాధునిక మోడర్న్ కాంటెంపరరీ వరల్డ్. ఈ రెండింటినీ అట్లీ తనదైన శైలిలో కనెక్ట్ చేస్తూ సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్‌తో నిర్మిస్తున్నారు. భారీ యాక్షన్ సీక్వెన్సెస్, కళ్ళు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి టెక్నికల్ ప్రమాణాలతో రూపొందుతున్న 'రాకా'.. భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌గా నిలవడం ఖాయం అని సినీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
