మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సరసన 'పెద్ది' మూవీలో నటించి బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హీట్ కొట్టింది బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్. ఈ చిత్రంలో అచ్చియమ్మగా తన నటనతో, గ్లామర్ తో ప్రేక్షకులను ఆకట్టుంది . ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. అయితే సినిమాల సంగతి పక్కన పెడితే .. ఈ ముద్దుగుమ్మ లవ్ లైఫ్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
లవ్ హింట్ ఇచ్చిన జాన్వీ..
ఈ బ్యూటీ మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సుశీల్ కుమార్ షిండే మనవడు శిఖర్ పహారియాతో ప్రేమాయణం సాగిస్తోందని చాలా కాలంగా రూమర్స్ వినిస్తున్నారు. అయితే ఎప్పుడూ లేని విధంగా లేటెస్ట్ గా జాన్వీ ఇచ్చిన లవ్ హింట్ నెటిజన్లకు మైండ్ బ్లాక్ చేస్తోంది నెట్టింట జాన్వీ . నైట్ డ్రెస్ పై ఉన్న కొటేషన్ ఫోటో ఒకటి తెగ ట్రెండ్ అవుతోంది.
ఆ నైట్‌సూట్ వెనుక సీక్రెట్ ఇదే!
తాజాగా జాన్వీ కపూర్ ఎయిర్‌పోర్ట్‌లో పింక్ కలర్ నైట్‌సూట్, గ్రే జాకెట్ వేసుకుని కెమెరాలకు చిక్కింది. అయితే అందరి కళ్ళు ఆమె ధరించిన డ్రెస్ పై ఉన్న కొటేషన్ మీదే పడ్డాయి. దానిపై నేను ఒకవేళ తప్పిపోతే.. దయచేసి నన్ను శిఖర్ పహారియాకు అప్పగించండి ( "If Lost, Please Return to Shikhar Pahariya" ) అని రాసి ఉంది. చూసేందుకు ఇది ఫన్నీగా ఉన్నా.. జాన్వీ మాత్రం తన రిలేషన్‌షిప్‌ను పరోక్షంగా అఫీషియల్ చేసేసిందని బాలీవుడ్ కోడై కూస్తోంది. ఇది కదా అసలైన రిలేషన్‌షిప్ గోల్స్ అంటే అంటూ ఫ్యాన్స్ ఈ క్రేజీ పిక్స్‌ను తెగ వైరల్ చేస్తున్నారు.
గతంలోనూ లవ్ సిగ్నల్స్..
జాన్వీ ఇలా ఓపెన్ కావడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆమె శిఖర్ అనే పేరున్న నెక్లెస్‌ను ధరించి బోల్డ్ గా కెమెరాల ముందుకు వచ్చింది. అంతేకాదు, గత ఏడాది కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో జాన్వీ నటించిన 'హోమ్‌బౌండ్' చిత్ర ప్రీమియర్‌కు శిఖర్ ప్రత్యేకంగా హాజరై ఆమెకు మద్దతుగా నిలిచాడు. తిరుమల శ్రీవారి దర్శనంతో పాటు పలు ఫ్యామిలీ ఈవెంట్లలో కూడా వీరిద్దరూ జంటగా సందడి చేశారు. ఏదేమైనా 'పెద్ది' సక్సెస్‌తో జోష్‌లో ఉన్న జాన్వీ.. ఇలా నైట్‌సూట్ కొటేషన్‌తో తన మనసులోని 'శిఖరాన్ని' అందరికీ చూపించేసి లవర్స్ కి కొత్త గోల్స్ సెట్ చేసింది..
लगता है इन दिनों जाह्नवी कपूर बिस्तर पर अकेलापन ज्यादा महसूस कर रही हैं, इसलिए वह अपनी नाइट ड्रेस के जरिए अपने बॉयफ्रेंड Shikhar Pahariya को याद कर रही हैं।
— Mr_cool77777 (@MR_COOL77777) June 22, 2026
जान्हवी कपूर एक बार फिर सुर्खियों में हैं, इस बार अपने क्यूट और मज़ेदार फैशन स्टेटमेंट को लेकर। हाल ही में सोशल मीडिया पर… pic.twitter.com/pTg88Omo06
