దేవరలో నటించడం అమ్మతో ఉన్నట్లుగా ఉంది.. జాన్వీ ఎమోషనల్ కామెంట్స్

దేవరలో నటించడం అమ్మతో ఉన్నట్లుగా ఉంది.. జాన్వీ ఎమోషనల్ కామెంట్స్

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్(Ntr) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ దేవర(Devara). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) తెరకెక్కిస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇదే ఆమె నటిస్తున్న మొదటి తెలుగు సినిమా అవడం విశేషం. దీంతో తొలిసారి తెలుగు సినిమాలో నటించడం చాలా ఎమోషనల్ గా ఫీలవుతున్నారు జాన్వీ. ఇందులో భాగంగా దేవర సినిమాపై ఎమోషనల్ కామెంట్స్ చేశారు జాన్వీ.   

ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ..‘‘ దేవర నా మొదటి తొలి తెలుగు సినిమా. నాకు తెలుగు రాదు. అందుకే డైలాగ్స్‌ నేర్చుకోవటానికి ఎక్కువ సమయం పడుతోంది. అమ్మ చాలా తెలుగు సినిమాల్లో నటించారు కానీ.. హిందీ, ఇంగ్లీష్‌ మాత్రమే మాట్లాడేవారు. చెన్నై వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు తమిళంలో మాట్లాడేది. అందుకే నాకు తెలుగు కంటే తమిళ్    బాగా తెలుసు. దేవర సినిమాలో నటించడం అనేది నా సొంత ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుంది. షూటింగ్ స్పాట్ లో ఉన్న అందరూ నా వాళ్లే అనే భావన కలుగుతోంది. తెలుగులో సినిమా చేయటం అంటే మా అమ్మతో ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఇదో ఆధ్యాత్మికమైన విషయం.. అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశారు జాన్వీ. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.