Janhvi Kapoor: తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్ళంట.. మరి అమ్మడు ఏమంటోంది?

Janhvi Kapoor: తిరుపతిలో జాన్వీ కపూర్ పెళ్ళంట.. మరి అమ్మడు ఏమంటోంది?

అతిలోక సుందరి శ్రీదేవి(SriDevi) కూతురు జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. నటిగా నిన్నమొన్నటివరకు బాలీవుడ్ ప్రేక్షకులను మాత్రమే ఈ బ్యూటీ.. అతిత్వరలో తెలుగు ప్రేక్షకులని సైతం మాయచేయనుంది. ఒకేసారి ఇద్దరు స్టార్ హీరోలతో సినిమాలను మొదలుపెట్టిన జాన్వీ.. తెలుగులో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. వాటిలో  మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తో దేవర, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో RC16 సినిమాలు ఉన్నాయి. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. 

ఇదిలా ఉంటే.. గత కొంత కాలంగా జాన్వీ కపూర్ పెళ్లి విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఆమె శిఖర్ పహారియాతో ప్రేమలో ఉందని, త్వరలోనే వీరి పెళ్లి జరుగనుందని వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా ఇదే విషయంపై ఓ నెటిజన్ శిఖర్, జాన్వీ పెళ్ళి తిరుపతిలో జరుగనున్నట్లు సోషల్ మీడియా పోస్టు చేశాడు. ఆ పోస్ట్ చూసిన జాన్వీ హాటుగా స్పదించారు. ఆ పోస్ట్ కి.. కుచ్ బీ.. అని కామెంట్ చేస్తూ.. ఇలా ఎలా రాస్తారని మండిపడ్డారు. అంతేకాదు.. తన పెళ్ళి గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ క్లారిటీ ఇచ్చారు జాన్వీ. అలా తన పెళ్లిపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టింది జాన్వీ.