దేవర షూట్‌‌లో జాయిన్ అయిన జాన్వీ కపూర్‌‌

దేవర షూట్‌‌లో జాయిన్ అయిన జాన్వీ కపూర్‌‌

జాన్వీ కపూర్‌‌ను టాలీవుడ్‌‌లో స్టార్ హీరోయిన్‌‌గా చూడాలని కోరుకున్నారు శ్రీదేవి. ఆరేళ్లుగా హిందీ సినిమాల్లో మాత్రమే నటించిన జాన్వీ.. ఇప్పుడు తన తల్లి కోరిక నెరవేర్చే దిశగా తెలుగులో వరుస సినిమాలు చేస్తోంది. ‘దేవర’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ఆమె, తాజాగా రామ్ చరణ్‌‌కు జంటగా బుచ్చిబాబు డైరెక్షన్‌‌లో నటిస్తోంది. ఇటీవల జరిగిన ఈ మూవీ ఓపెనింగ్‌‌లోనూ సందడి చేసింది.

ఇదిలా ఉంటే.. ఇప్పటికే ‘దేవర’ చిత్రానికి సంబంధించి ఓ షెడ్యూల్ షూటింగ్‌‌లో పాల్గొన్ని ఆమె, తిరిగి సెట్స్‌‌లో జాయిన్ అయింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం గోవాలో షూటింగ్ జరుగుతోంది.  జాన్వీ కూడా షూట్‌‌లో పాల్గొంటోంది. మరోసారి ‘తంగం’ పాత్రలోకి వచ్చినందుకు సంతోషంగా ఉందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది జాన్వీకపూర్. ఎన్టీఆర్, జాన్వీ మధ్య వచ్చే కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ‘దేవర’ ఫస్ట్ పార్ట్‌‌ అక్టోబర్ 10న విడుదల కానుంది. సైఫ్‌‌ అలీఖాన్ విలన్‌‌గా నటిస్తున్నాడు. అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.