శ్రీదేవిని గుర్తు చేసేలా జాన్వీ..

శ్రీదేవిని గుర్తు చేసేలా జాన్వీ..

బాలీవుడు ముద్గుగుమ్మ జాన్వీ కపూర్( Janhvi Kapoor) పల్లెటూరి పడుచుల కనిపించబోతుంది. ఎన్టీఆర్ తో జోడిగా నటిస్తున్న దేవర సినిమాలో ఫిషర్ మాన్ కూతురిలా నటించబోతుంది. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే దేవరలో జాన్వీ పాత్ర ఎలా ఉండబోతుంది అన్న దానిపై గతంలోనే ఓ ఫస్ట్ లుక్ విడుదల చేసింది చిత్రబృందం.

తాజాగా జాన్వీకి సంబంధించి మరో ఫొటోను కూడా రిలీవ్ చేసింది. సినిమాలో జాన్వీ పాత్ర పేరు తంగం అని తెలిపింది. ఈ చిత్రంలో జాన్వీ అచ్చం పల్లెటూరి అమ్మాయిల కనిపిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో జాన్వీ ఫొటో హల్ చల్ సృష్టిస్తుంది. నెటిజన్ల నుంచి మంచి స్పందన లభిస్తోంది.

ALSO READ :- ODI World Cup 2023: పాండ్యాకు ఫిట్‌నెస్ కష్టాలు.. తదుపరి రెండు మ్యాచ్‌లకు అనుమానమే!

రంగస్థలంలో సమంత, పుష్పలో రష్మిక పల్లెటూరి అమ్మాయిల పాత్రలు పోషించారు. ఈ రెండు క్యారెక్టర్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. జాన్వీ పాత్రకు కూడా అదే స్థాయిలో ఆదరణ వస్తుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.