Janhvi Kapoor: ఫిల్మ్ఫేర్ వేదికపై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మత్తెక్కించిన జాన్వీ

Janhvi Kapoor: ఫిల్మ్ఫేర్ వేదికపై డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో మత్తెక్కించిన  జాన్వీ

అతిలోక సుందరి స్వీట్ డాటర్ జాన్వీకపూర్(Janhvikapoor) బుంగమూతి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 69వ ఫిల్మ్ ఫేర్ (Filmfare Awards)వేడుక‌ల్లో భాగంగా బాలీవుడ్ బ్యూటీలంతా లైవ్ పెర్పార్మెన్స్తో అల‌రించారు. అందులో జాన్వీపూర్ కూడా స్టేజ్ పెర్పార్మెన్స్ ఇచ్చింది.

జాన్వీకపూర్ త‌నకు ఇష్ట‌మైన పాట‌ల‌న్నింటికీ డాన్సు చేసి అమ్మ‌డు ఆక‌ట్టుకుంది. మిరుమిట్లు గొలిపే గులాబీ రంగు స్క‌ర్ట్.. బ్లౌజ్ ప్ర‌తీది జాన్వీలో మాస్ అప్పిరియ‌న్స్ని తీసుకొచ్చింది. అమ్మ‌డి సిగ్నెచ‌ర్ స్టెప్పులు మాస్ బీట్కి ప‌ర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన‌ట్లు క‌నిపిస్తోంది. ముఖంలో జాన్వీ ఎక్స్ ప్రెష‌న్స్..మూతి బిగింపు మాస్లో విజిల్స్ వేయించేలా ఉంది.

అయితే వేదిక‌పై జాన్వీ బాలీవుడ్ ఐకానిక్ పాట‌ల‌కు డాన్సు చేసి మెప్పించింది. ఈ ఫోటోని ఇన్స్టాలో షేర్ చేసి త‌న అభిప్రాయాన్ని కూడా పంచుకుంది. `నాకు చాలా ఇష్టమైన మరియు అత్యంత ప్రసిద్ధ హిందీ సినిమా క్వీన్స్ పాటలపై నృత్యం చేయడం నాకు ఎంత గొప్పగా..గ‌ర్వంగా అని పించింది. ఎంతటి గౌరవం ద‌క్క‌డం అదృష్టంగా భావిస్తున్నానంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది.

ఎన్టీఆర్ స‌ర‌స‌న దేవ‌ర సినిమాలో హీరోయిన్‌గా చేస్తున్న విష‌యం తెలిసిందే. ఇక‌, ఇప్పుడు త‌మిళ స్టార్ హీరో సూర్య స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని దక్కించుకుంది. బాలీవుడ్ దర్శకుడు రాకేష్ ఓం ప్రకాష్ మిశ్ర ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియన్ సినిమా 'కర్ణ'లో నటిస్తోంది.