జైలర్ కోసం జపాన్ నుండి వచ్చేశారు.. ఇది కదా రజని క్రేజ్ అంటే

జైలర్ కోసం జపాన్ నుండి వచ్చేశారు.. ఇది కదా రజని క్రేజ్ అంటే

ప్రపంచవ్యాప్తంగా సూపర్‌స్టార్ రజినీకాంత్(Rajanikanth) కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నుండి ఒక సినిమా వస్తుందంటే కేవలం ఇండియాలోనే కాదు.. వరల్డ్ వైడ్ గా ఆ క్రేజ్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా జపాన్ లో. రజనీకాంత్ కు జపాన్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఒక రేంజ్ లో ఉంటుంది. ఇక రజనీకాంత్ లేటెస్ట్ మూవీ జైలర్(Jailer) కు కూడా అదే రిపీట్ అయ్యింది.     

ALSO READ: రజనీకాంత్తో ఆ ఒక్క సీన్.. లక్షల మందిలో నేను కూడా!

జైలర్‌ సినిమాను చూసేందకు ఒక జంట జపాన్‌ నుండి చెన్నైకి వచ్చింది. జైలర్ సినిమా జపాన్‌లో కూడా రిలీజయింది.. కానీ రజనీకాంత్ సినిమా చెన్నైలోనే చూడాలని ఇంత దూరం వచ్చినట్టు జపాన్‌ రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ అసోషియేషన్‌ లీడర్‌ యసుదా హిడెతోషి(Yasuda hidethoshi) తెలిపారు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ న్యూస్ తెలుసుకున్న రజని ఫ్యాన్స్.. ఇది కదా రజనీకాంత్ క్రేజ్ అంటే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

యసుదా హిడెతోషి రజనీకాంత్ కు వీరాభిమాని. రజనికాంత్ పేరుమీద జపాన్‌లో పలు సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు యసుదా హిడెతోషి. జైలర్ సినిమాకు సంబంధించిన కార్యక్రమాల కోసం రజనీకాంత్ ఇటీవల జపాన్‌కు వెళ్తే.. ఆ ఏర్పట్లాన్ని యసుదానే దగ్గరుండి చూసుకున్నారు.