Anudeep: జాతిరత్నాలు అనుదీప్ మౌనం..హీరోల సంఖ్యను పెంచేస్తోంది!

Anudeep: జాతిరత్నాలు అనుదీప్ మౌనం..హీరోల సంఖ్యను పెంచేస్తోంది!

జాతిరత్నాలు (Jathirathnalu) సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అనుదీప్(Anudeep). కరోనా తరవాత థియేటర్స్ లోకి వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ విజయంతో పాటు కలెక్షన్స్ రాబట్టింది. దీంతో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు అనుదీప్. అదే ఊపుతో రెండు సినిమాగా ప్రిన్స్ సినిమాను తెరకెక్కించాడు. తమిళ హీరో శివ కార్తికేయన్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్లాప్ రిజల్ట్ ను మూటగట్టుకుంది. దీంతో కొంతకాలంగా సైలెంట్ అయిపోయాడు అనుదీప్. 

ఇక తాజాగా ఆ దర్శకుడు తరువాతి సినిమాపై ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే..అనుదీప్ తన నెక్స్ట్ సినిమాను మాస్ మహారాజ్ రవితేజతో చేయబోతున్నాడట. ఈ ప్రాజెక్టు గురించి ఇద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయని, త్వరలోనే అధికారికంగా ప్రకటన వచ్చే అవకాశం ఉండాలి సమాచారం.

అంతేకాదు ఈ సినిమాలో రవితేజకు జోడీగా శ్రద్దా శ్రీనాథ్ ను సెలెక్ట్ చేశాడట అనుదీప్. జాతిరత్నాలు తరహాలోనే అవుట్ అండ్ ఫుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాను స్వప్న సినిమాపై నాగ్ అశ్విన్ నిర్మించనున్నారట. వీలైనంత త్వరగా షూటింగ్ కంప్లీట్ చేసి.. ఈ ఇయర్ ఎండింగ్ లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్. 

ఇదిలా ఉంటే..అనుదీప్ లిస్ట్ లో ముందుగా వినిపిస్తున్న మరో ప్రాజెక్టు విక్టరీ వెంకటేష్ (Victory Venkatesh) తో. నిజానికి ఈ కాంబోకి సంబందించిన న్యూస్ జాతిరత్నాలు రిలీజ్ తరువాత నుండి వినిపిస్తున్నాయి. కానీ అనుకోకుండా ఈ ప్రాజెక్టు డిలే అయ్యింది. ఇక తాజాగా మరోసారి ఈ ప్రాజెక్టు తెరపైకి వచ్చింది. 

అంతేకాదు అనుదీప్ తమిళ స్టార్ హీరో కార్తీ (Karthi)కి కూడా ఈ మధ్య ఒక కథ వినిపంచారట. ఆ కథ కార్తీకి కూడా బాగా నచ్చడంతో వెంటనే ఒకే చెప్పేశాడని సమచారం. అలాగే టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్(Geetha arts) లో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నారట అనుదీప్. ఈ ప్రాజెక్టు కు సంబంధించి ఇప్పటికే అడ్వాన్స్ కూడా తీసుకున్నారట. అయితే..ప్రస్తుతం అనుదీప్ లిస్ట్ లో నుంచి రాబోతున్న సినిమా ఏంటనేది మాత్రం క్లారిటీ లేదు.

  ALSO READ :- ఈ–బైక్​ బ్యాటరీ పేలి.. జర్నలిస్టు మృతి

అనుదీప్ కూడా ఎక్కడ తన సినిమాల గురించి ప్రస్తావించలేదు. దీంతో అనుదీప్ లో మౌనం పెరిగేకొద్ది..సినిమాల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక ఫ్యాన్స్ మీ నుంచి సినిమాలు రాకపోవడంతో పాటు..ఈ సినిమాల హీరోల లిస్ట్ తెలిసి మరింత ఎదురుచూస్తున్నారు. త్వరగా స్టార్ట్ చేయండి బాస్..కడుపుబ్బా నవ్వుకుని చాన్నాళ్ళైంది!