Jayajanaki Nayaka: ఫ్లాప్ సినిమా ప్రపంచ రికార్డ్.. జయజానకి నాయక సంచలనం!

Jayajanaki Nayaka: ఫ్లాప్ సినిమా ప్రపంచ రికార్డ్.. జయజానకి నాయక సంచలనం!

మాములుగా ఏదైనా  సినిమా బాగుంటే ప్రేక్షకులు ఆ సినిమాను మళ్ళీ మళ్ళీ చూడటానికి  ఇష్టపడతారు. దాంతో అది సూపర్ కలెక్షన్స్, సరికొత్త రికార్డ్స్ సాధించడం జరుగుతుంది. కానీ, ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే సినిమా సూపర్ ప్లాప్ గా నిలిచింది. సినిమాపై చాలా ట్రోలింగ్స్ కూడా జరిగాయి. కానీ, ఇప్పుడు ఆ సినిమా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటి ఫ్లాప్ అయినా సినిమా ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేయడం ఏంటా అనుకుంటున్నారా. మరి అదే ఇక్కడ మ్యాజిక్కు. ఇంతకీ ఆ సినిమా ఏంటంటే.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్(Bellamkonda Sai Srinivas) హీరోగా వచ్చిన జయజానకి నాయక(Jayajanaki Nayaka).      

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ సినిమా మంచి అంచనాల మధ్య వచ్చి ప్లాప్ గా నిలిచింది. సినిమాలోని యాక్షన్ సీన్స్, సాంగ్స్ పై ట్రోలింగ్స్ కూడా చాలానే జరిగాయి. దీంతో.. మేకర్స్ కు భారీ నష్టాలు మిగిల్చింది ఈ సినిమా. అందుకే తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను పెద్దగా గుర్తుపెట్టుకోలేదు. అయితే తాజాగా ఈ సినిమా హిందీ డబుడ్ వర్షన్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేసింది పెన్ ఇండియా సంస్థ. హిందీలో ఈ సినిమాకు అనూహ్యంగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రికార్డ్స్ వ్యూస్ తో దూసుకుపోతోంది.

ఈ క్రమంలో ఇప్పటివరకు ఉన్న యూట్యూబ్ రికార్డులను బ్రేక్ చేస్తూ.. ఏకంగా 800 మిలియన్ వ్యూస్ సాధించి ప్రపంచ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆలా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ సాధించిన ఫస్ట్ ఇండియన్ సినిమాగా నిలిచింది జయజానకి నాయక. ఇదే విషయాన్ని ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ సొంతం చేసుకున్న పెన్ స్టూడియోస్ అధికారికంగా ప్రకటించింది. దీంతో తెలుగు ఆడియన్స్ అవాక్కవుతున్నారు.