
జయసుధ కొడుకు నిహిర్ కపూర్ లీడ్ రోల్‌లో చదలవాడ శ్రీనివాసరావు దర్శక నిర్మాతగా తెరకెక్కించిన చిత్రం ‘రికార్డ్ బ్రేక్’. మార్చి 8న సినిమా విడుదల. ఈ సందర్భంగా నిహిర్ మాట్లాడుతూ ‘ఇదే సంస్థలో ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ సినిమా చేశా. ఆ సమయంలో చదలవాడ శ్రీనివాసరావు గారు ‘రికార్డ్ బ్రేక్’ స్టోరీ చెప్పారు. అడవిలో పెరిగిన ఇద్దరు అనాధలైన ట్విన్స్... కుస్తీ పోటీలు నేర్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎలా చేరుకున్నారనేది మెయిన్ కాన్సెప్ట్.
కుస్తీ మాత్రమే కాకుండా సెంటిమెంట్, ఎమోషన్, యాక్షన్, పాటలు కలగలిపిన కమర్షియల్ సినిమా ఇది. ముఖ్యంగా మదర్ సెంటిమెంట్ ఆకట్టుకుంటుంది. ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ దేశభక్తి సినిమా. అందుకే ఎనిమిది భాషల్లో విడుదల చేస్తున్నాం.
ఇటీవల అమ్మ (జయసుధ) ట్రైలర్‌తో పాటు సినిమాని కొంత చూసి, మంచి రెస్పాన్స్ ఇచ్చారు. మరోసారి ఫుల్ మూవీ చూస్తామన్నారు. తను ఏం చెప్తారో అని ఎదురుచూస్తున్నా. నటుడిగా ఇకపై కంటిన్యూగా సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అని చెప్పాడు.