
గార్డెన్లకు డెకరేట్ చేయాలి అనుకున్నప్పుడు ఈ గాడ్జెట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ లైట్‌ని హర్డోల్ అనే కంపెనీ తీసుకొచ్చింది. ఇది పాలీ క్రిస్టలైన్ సిలికాన్ సోలార్ ప్యానెల్‌తో వస్తుంది. ఇందులో 600 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంటుంది. వాటర్‌ప్రూఫ్‌తో రావడం వల్ల వర్షం, మంచు లాంటివాటిని తట్టుకుంటుంది. స్టెయిన్లెస్ స్టీల్, ప్లాస్టిక్ మెటీరియల్‌తో దీన్ని తయారుచేశారు. ఎండలో ఉన్నప్పుడు బ్యాటరీ 5– 7 గంటల్లో చార్జ్ అవుతుంది.
రాత్రిపూట 8 గంటల వరకు పనిచేస్తుంది. ఇది ఫౌంటైన్, జెల్లీ ఫిష్ ఆకారంలో వెలగడం వల్ల చూడడానికి చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. భూమిలో నాటడానికి దీనికి స్పైక్ కూడా వస్తుంది. ఇందులో ఉండే సెన్సర్ల వల్ల చీకటి పడగానే ఆటోమెటిక్‌గా లైట్లు వెలుగుతాయి. మళ్లీ ఉదయం వాటిని ఆఫ్ చేయాల్సిన పనికూడా లేదు. సూర్యుడు ఉదయించిన వెంటనే ఆటోమెటిక్‌గా ఆఫ్ అవుతాయి.