ఆసక్తి రేపిన జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆసక్తి రేపిన జితేందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రెడ్డి కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

‘ఉయ్యాల జంపాల’ ఫేమ్ విరించి వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘జితేందర్ రెడ్డి’.  ఇందులో హీరో ఎవరనేది రివీల్ చేయకుండా పోస్టర్స్‌‌‌‌‌‌‌‌తో ఆసక్తి రేపిన టీమ్..  సోమవారం హీరో లుక్‌‌‌‌‌‌‌‌ను రివీల్ చేస్తూ కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను రిలీజ్ చేశారు. బాహుబలి, ఎవ్వరికీ చెప్పొద్దు చిత్రాల ఫేమ్ రాకేష్ వర్రే.. జితేందర్ రెడ్డి పాత్రలో కనిపించాడు. 

ఎనర్జిటిక్‌‌‌‌‌‌‌‌ లుక్‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న రాకేష్... గన్ పట్టుకుని డైనమిక్‌‌‌‌‌‌‌‌గా నడుచుకుంటూ వస్తున్నాడు. మరిన్ని వివరాలను త్వరలో ప్రకటిస్తామని నిర్మాత ముదుగంటి రవీందర్ రెడ్డి చెప్పారు. గోపీ సుందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు.