JoJo Teaser: ఏంటి బ్రో ఇంత మాట అనేసింది.. బోల్డ్ డైలాగ్స్తో ‘జో జో’ టీజర్ వైరల్

JoJo Teaser: ఏంటి బ్రో ఇంత మాట అనేసింది.. బోల్డ్ డైలాగ్స్తో ‘జో జో’ టీజర్ వైరల్

కృష్ణ క‌‌‌‌మ‌‌‌‌ల్, మ‌‌‌‌హి హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న రూర‌‌‌‌ల్ కామెడీ డ్రామా ‘జో జో’. రాయ‌‌‌‌ల‌‌‌‌సీమ బ్యాక్‌‌‌‌డ్రాప్‌‌‌‌లో తెర‌‌‌‌కెక్కుతోన్న ఈ సినిమా ద‌‌‌‌ర్శకుడు దేవ‌‌‌‌క‌‌‌‌ట్టా స‌‌‌‌మ‌‌‌‌ర్పణ‌‌‌‌లో కిర‌‌‌‌ణ్ జ‌‌‌‌య్ కుమార్ ద‌‌‌‌ర్శకుడిగా రూపొందుతోంది. విజ‌‌‌‌య్ కృష్ణ లింగ‌‌‌‌మ‌‌‌‌నేని నిర్మిస్తున్నారు. సోమ‌‌‌‌వారం కాష‌‌‌‌న్ 1 పేరుతో ఈ సినిమా కంటెంట్ ఏంట‌‌‌‌నే విష‌‌‌‌యాన్ని తెలియ‌‌‌‌జేస్తూ ఓ వీడియో గ్లింప్స్‌‌‌‌ను రిలీజ్ చేశారు. 

రాయలసీమలోని జొన్నగిరిలో వర్షాలు పడిన తర్వాత పొలాల్లో వజ్రాలు దొరుకుతాయనే ఆసక్తికరమైన అంశాన్ని ఆధారంగా చేసుకుని ఈ రూరల్ లవ్‌‌‌‌స్టోరీని కామెడీ టచ్‌‌‌‌తో రూపొందిస్తున్నారు. విడుదలైన గ్లింప్స్‌‌‌‌లో హీరో, హీరోయిన్‌‌‌‌తో పాటు మరికొందరు వజ్రాల కోసం వెతకడం, ఈ క్రమంలో హీరోకు ఎదురయ్యే సరదా సంఘటనలు నవ్వులు పూయిస్తున్నాయి.

రూరల్ రస్టిక్గా లవ్‌స్టోరీగా ‘జో జో’ గ్లింప్స్‌ లో డైలాగ్స్ మోటుగా ఉన్నాయి. వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయట అంటూ మొదలవ్వగా.. " ఏంటమ్మాయి.. మొత్తం రాళ్లే ఏరుతున్నావు అని ఓ పెద్దమనిషి అనగా.. ఆ వెంటనే హీరో మాట్లాడుతూ.. పనిచేయని గడియారం కూడా రోజుకు రెండుసార్లు కరెక్ట్ టైం చూపిస్తుంది.. మనకి కూడా ఓ రోజు వస్తుంది అని అంటాడు. ఆ తర్వాత చిరాకు తెచ్చుకున్న హీరోయిన్ ' నీ గు** నువ్వు కడుక్కో.. దొబ్బెయ్.. అని తడి.. ఆ వెంటనే హీరో ఫ్రెండ్.. ఏంటి మామ ఇంత మాట అన్నది.. మోటు సరసంరా.. అంటూ సాగిన టీజర్ అలరిస్తుంది.. 

రా అండ్ రస్టిక్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  ఈ చిత్రంలో మకరంద్ దేశ్‌‌‌‌పాండే, ఫణీంద్ర దేవరపల్లి, భాషా, రాజు, సతీష్ దేవట్టె, శరత్, ప్రభావతి  కీలక పాత్రల్లో నటిస్తున్నారు.