ఆర్మీలో టెక్నికల్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్​

ఆర్మీలో టెక్నికల్  గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్​

డెహ్రాడూన్​లోని ఇండియన్ మిలిటరీ అకాడమీలో జనవరి 2025లో ప్రారంభమయ్యే 140వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సులో అడ్మిషన్స్​కు అర్హులైన అవివాహిత పురుషుల నుంచి ఇండియన్ ఆర్మీ అప్లికేషన్స్​ కోరుతోంది.

అర్హత: మొత్తం 30 ఖాళీలకు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులు లేదా ఇంజినీరింగ్ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయసు 20 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

సెలెక్షన్​: అప్లికేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ షార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లిస్ట్, స్టేజ్-1/ స్టేజ్-2 టెస్టులు, ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీ ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులు మే 9 వరకు దరఖాస్తు చేసుకోవాలి. పూర్తి వివరాలకు www.joinindianarmy.nic.in వెబ్​సైట్​లో సంప్రదించాలి.