జోకర్ మూవీ ప్రారంభం

జోకర్ మూవీ ప్రారంభం

మౌర్య సిద్ధవరం, తన్వి ఆకాంక్ష జంటగా గీత సి.శేఖ‌‌‌‌ర్‌‌‌‌ దర్శకత్వంలో సందీప్ రామినేని (శాండి) నిర్మిస్తున్న చిత్రం ‘జోకర్‌‌‌‌‌‌‌‌’. శనివారం ఉదయం రామానాయుడు స్టూడియోస్‌‌‌‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ముహూర్తపు స‌‌‌‌న్నివేశానికి సీనియర్ నిర్మాత అల్లు అర‌‌‌‌వింద్ క్లాప్ కొట్టగా, అల్లు అర్జున్ భార్య స్నేహ కెమెరా స్విచాన్‌‌‌‌ చేశారు. 

నిర్మాత బన్నీ వాస్‌‌‌‌ స్క్రిప్ట్‌‌‌‌ను మేకర్స్‌‌‌‌ను అందజేశారు. అనంతరం నిర్మాత సందీప్ రామినేని మాట్లాడుతూ ‘మా బ్యానర్‌‌‌‌‌‌‌‌లో ఇదే తొలిచిత్రం. ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్‌‌‌‌‌‌‌‌గా తెరకెక్కిస్తున్నాం. 

డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ గీత సి శేఖర్‌‌‌‌‌‌‌‌ ఫన్‌‌‌‌తో పాటు ఎమోషనల్ టచ్‌‌‌‌ ఉండేలా స్క్రిప్ట్‌‌‌‌ను రెడీ చేశారు. ఆగస్టు నుంచి షూటింగ్‌‌‌‌ స్టార్ట్‌‌‌‌ చేస్తున్నాం. త్వరలోనే ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌‌‌‌ వివరాలను వెల్లడిస్తాం’ అని చెప్పారు.